అన్వేషించండి

Bandi Sanjay : భౌతిక దాడులు ఖాయం - బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక !

భగవద్గీతను కించ పరిస్తే భౌతిక దాడులు చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణలో బ్రాహ్మణులకు రక్షణ లేదన్నారు.


Bandi Sanjay :    తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.  భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు చేస్తామని అన్నారు. రామాయణం, మహాభారతాన్ని కామెడీగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వైకుంఠధామాలకే భగవద్గీత పరిమితం అయిందని అన్నారు. తెలంగాణలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రామాయణం, భగవద్గీత‌ను కూడా కించపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే… ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. అర్చకులను, దేవుళ్లను కించపరచడం మంచి సంస్కృతి అనిపించుకోదన్నారు. బీజేపీ అంటేనే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే పార్టీ అన్నారు.  ఇమామ్‌లకు ఇచ్చే గౌరవం.. అర్చకులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. 

ప్రజా సంగ్రామ యాత్ర 3 లో భాగంగా బండి సంజయ్ జనగామ సమీపంలోని కుందారంలో అర్చకులతో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అర్చకులు బండి సంజయ్ ను సత్కరించారు. హిందూ వ్యతిరేక జెండాలను బొందపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు. అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ అని తెలిపారు. అధికారంలోకి రాగానే పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీలో లాబీయింగ్‌లు ఉండవని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఉంటాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.బ్రాహ్మణులకు కూడా రాజకీయంగా మసహకరిస్తాం.. మీరందరూ క్షేమంగా ఉంటే.. మేము సంతోషంగా ఉంటామని తెలిపారు.  

కులాల ప్రాతిపదికన టికెట్స్ కాదు.. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తాం.. అందులో భాగంగా బ్రాహ్మణులు సహా అందరికీ టికెట్స్ ఇస్తామన్నారు.  రాబోయే రోజుల్లో పక్కా బీజేపీ అధికారంలోకి వస్తుందని  ధీమా వ్యక్తం చేశారు.  బ్రాహ్మణులు చాలా వరకు కడు పేదరికంలో ఉన్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రూ.1000 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  బ్రాహ్మణులకే కాదు.. కుల, మతాలకు అతీతంగా ఉచిత విద్య, వైద్యం తప్పనిసరిగా అందించాలన్నారు.   ప్రతి జిల్లాలో వేద పాఠశాలలు ఉండే విధంగా నా వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 

బండి సంజయ్ పాదయాత్ర జనగామలో ప్రవేశించనుంది.   జనగామలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. రెండు పార్టీలు పోటీపోటీగా ఫ్లెక్సీలు, ప్రచార హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాలు విసురుతూ టీఆర్ఎస్ శ్రేణులు వీటిని ఏర్పాటు చేశాయి. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులను తీసుకొచ్చిన తర్వాతే జనగామలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీల్లో టీఆర్ఎస్ పేర్కొంది. ఈ ఫ్లెక్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏర్పాటు చేశారు. మరోవైపు, బండి సంజయ్ కి స్వాగతం పలుకుతూ బీజేపీ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే బీజేపీ ఫ్లెక్సీలను కొందరు చించేయడంతో... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget