అన్వేషించండి

Nandi Kotkuru Politics : బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి షాకివ్వనున్న టీడీపీ - నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతోంది ఇదే

Byreddy Siddhartha Reddy : వైసీపీ ఓడిపోవడంతో నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఆయన వర్గీయులంతా టీడీపీలో చేరుతున్నారు.

Nandi Kotkuru  Byreddy Siddhartha Reddy :   ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గంలో  బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హవాకు టీడీపీ పూర్తి స్థాయిలో చెక్ పెడుతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరింది. ఇప్పుడు  మున్సిపాలిటీ లో పాగా వేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా  మున్సిపాలిటీ లో ఉన్న కౌన్సిలర్లు ను తన వైపు తిప్పుకుంది. మున్సిపాలిటీపై  పసుపు జెండా ను ఎగుర వేసేందుకు సిద్దమైంది.  

టీడీపీలో చేరిపోతున్న వైసీపీ కౌన్సిలర్లు

గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో  విజయం సాధించిది. 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో కేవలం రెండు  మున్సిపాలిటీ ల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఎన్నికల తర్వాత ఈ లెక్కలు మారుతున్నాయి.  నంద్యాల జిల్లా నందికొట్కూరులో  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఖాతాలో ఉన్న నందికొట్కూరు పురపాలక ను  ప్రస్తుతం టీడీపీ  కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.  రెండు మూడు నెలల్లో క్రితం మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు వైసిపి కి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు.  మూడేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి పార్టీ ఏకపక్షంగా మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది.   అధికారంలోకి కూటమి రావడంతో ఇపుడు టీడీపీ నేతలు పట్టు సాధించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి షాక్ ఇవ్వనున్న టీడీపీ                                     

నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా వైసీపీ   21,ఇండిపెండెంట్ 7 టిడిపి 1 గా గెలుపొందారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి  కనుసన్నల్లోనే పురపాలక సంఘం నడిచేది. అక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హవా నడిచేది. అయితే వైసీపీ అధికారం కోల్పోవడం... టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ కి చెందిన కౌన్సిలర్లు జంప్ జిలానిలు అయ్యారు.  ప్రధానంగా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తో సహా  కొంత మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకున్నారు. మరి కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో సైకిల్ ఎక్కారు. దింతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వర్గం పూర్తిగా టీడీపీలో చేరిపోయినట్లయింది. 

నందికొట్కూరు పై సిద్ధార్థ రెడ్డి హవ తగ్గిపోతోందా                 

నంద్యాల జిల్లా నందికొట్కూరు   నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుపొందాలన్న సిద్ధార్థ రెడ్డి ఆశీస్సులు కచ్చితంగా కావాల్సిందే. ఎమ్మెల్యే అయినప్పటికీ సిద్ధార్థ రెడ్డి చెప్పిందే అక్కడ నడుస్తుంది అనటంలో అతిగా శక్తి లేదు.  మున్ముందు కూడా సిద్ధార్థ రెడ్డి వర్గాన్ని బలహీన పరిచి నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను బలపర్చడానికి టీడీపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget