అన్వేషించండి

TDP Support BJP : మునుగోడులో బీజేపీకి టీడీపీ మద్దతు - చంద్రబాబును కలవనున్న రాజగోపాల్ రెడ్డి !

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి.. చంద్రబాబును కలవనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలుచెబుతున్నాయి.


TDP Support BJP :  మునుగోడు ఉపఎన్నికల పోరు హోరాహోరీగా ఉండటంతో  పోటీలోని పక్షాల మద్దతును కూడగట్టుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.  బీజేపీ అబ్యర్థి రాజగోపాల్ రెడ్డి .. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించడంతోనే ఆయనను రాజగోపాల్ రెడ్డి కలుస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  రాజగోపాల్ రెడ్డి చంద్రబాబును కలిసిన తర్వాత బీజేపీకి మద్దతుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

మునుగోడులో పోటీకి దూరంగా టీడీపీ 

మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. వారం రోజుల కిందట తెలంగాణ టీడీపీ నేతలు .. చంద్రబాబును కలిసి మునుగోడులో పోటీ చేయాలన్న విజ్ఞప్తి చేశారు. పలువురు బీసీ నేతలు రెడీగా ఉన్నారన్నారు.  అద సమయంలో టీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కని బూర నర్సయ్య గౌడ్ కూడా పార్టీ తరపున పోటీకి ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని.. అసెంబ్లీ ఎన్నకిల్లా బలపడేందుకు ప్రయత్నిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించాలని భావిస్తున్నారు. 

టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు

నిజానికి తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధమయిందని..  ఢిల్లీ నుంచి కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ప్రతిగా ఏపీలో సహకరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రకారం... ప్రస్తుత పరిణామాలు అనుకూలంగా జరుగుతున్నాయి.  నిజానికి కోమటిరెడ్డి సోదరులు టీడీపీకి వ్యతిరేకం. టీడీపీతో పొత్తు వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెబుతారు. కానీ ఇప్పుడు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరారు. ఆయన టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్  పెద్దలు కూడా అదే సూచించడంతో ఆయన కూడా చంద్రబాబు మద్దతు అడగాలని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కల్లా టీడీపీని ఎంతో కొంత బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. బ లమైన బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయనకు టీ టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. 

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో టీడీపీకి వెసులుబాటు

ఇప్పటి వరకూ తెలంగాణలో టీడీపీని ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేశారు. ఈ కారణంగాఆ పార్టీ ముందుకు సాగడం కష్టమంది. నేతలు పార్టీ వీడిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా  బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఈ తరుణంలో టీడీపీ బలపడటానికి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు.  అందుకే టీడీపీ జోరు పెంచాలనుకుంటోంది. బజేపీతో ముందుకు సాగాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget