అన్వేషించండి

Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!

Sunil Kanugolu Congress Strategist:కాంగ్రెస్జాతీయ స్థాయిలో పట్టు సాధించాలంటే తెలంగాణ, కర్ణాటకల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కీలకం. సునీల్ కనుగోలుతో కలిసి డీకే, రేవంత్ తాము అనుకున్నది చేయాల్సి ఉంది.

Congress South Electoral Strategy: భారత జాతీయ రాజకీయాల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడాలంటే, ఆ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలే కీలకం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గుర్రమెక్కి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేసులో నిలబడాలన్నా.. లేదా కనీసం గట్టి పోటీ ఇవ్వాలన్నా.. ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉన్న రెండు బలమైన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం అత్యంత కీలకం.  అందుకే కర్ణాటక సీఎంగా బాధ్యతలు తీసుకున్న  డీకే శివకుమార్ తన వ్యూహకర్త సునీల్ కనుగోలును అధికారిక సలహాదారుగా నియమించుకోగా, అటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సైతం కనుగోలు వ్యూహాల ఆధారంగానే అడుగులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలులతో కూడిన ఈ  దక్షిణాది త్రయం   పైనే ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ భవిష్యత్తు ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రజా వ్యతిరేకత తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు

ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన ట్రెండ్ నడుస్తోంది. కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ  ప్రభుత్వాలు ఉన్న చోట యాంటీ-ఇంకంబెన్సీని అధిగమించి వరుసగా రెండోసారి, మూడోసారి అధికారంలోకి రావడం కనిపిస్తోంది కానీ.. కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఒకసారి అధికారమిచ్చిన ప్రజలు, రెండోసారి వచ్చేసరికి తీవ్ర అసంతృప్తితో హస్తం పార్టీని గద్దె దించుతున్న దాఖలాలు గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడు సార్లు తిరుగులేని మెజార్టీతో పాలించిన ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ సైతం, చివరకు ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

సునీల్ కనుగోలు ముందు అతి పెద్ద సవాల్ ప్రో ఇంకంబెన్సీ

ఈ ‘యాంటీ-ఇంకంబెన్సీ’ సూత్రాన్ని బ్రేక్ చేయడమే ఇప్పుడు వ్యూహకర్త సునీల్ కనుగోలు ముందున్న అతిపెద్ద సవాలు. సాధారణంగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సెమీఫైనల్స్‌లో గెలిస్తేనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఊపు వస్తుంది. గతంలో తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కనుగోలు ప్లాన్ చేసిన గ్యారంటీల వ్యూహం అద్భుతంగా పనిచేసింది. కానీ, అధికారాన్ని దక్కించుకోవడానికి ‘గ్యారంటీలు’ ఇచ్చినంత సులువుగా.. వాటిని అమలు చేస్తూ, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూ, ప్రజా వ్యతిరేకత రాకుండా ప్రభుత్వాన్ని రెండోసారి గెలిపించడం సాధ్యం కాదనేది వాస్తవం. ఈ హిమాలయ టాస్క్‌ను అధిగమించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ‘ట్రబుల్ షూటర్’ డీకే శివకుమార్.. సునీల్ కనుగోలుతో కలిసి సరికొత్త పొలిటికల్ మ్యాజిక్ చేయాల్సి ఉంది. కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా, పరిపాలనలో సమర్థతను చాటుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్‌గా ఉంచేలా కనుగోలు సరికొత్త డేటా నమూనాలను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ముందే గుర్తించి, అవసరమైతే సిట్టింగులను మార్చడం ద్వారా ‘ప్రో-ఇంకంబెన్సీ’   వాతావరణాన్ని సృష్టించేలా రేవంత్, డీకేలను కనుగోలు నడిపిస్తున్నారు. 

అంతా ఈ ముగ్గురి చేతుల్లోనే !

దిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని పీఠంపై కూర్చోవాలనే ఆశలు సజీవంగా ఉండాలన్నా, కేంద్రంలో కాంగ్రెస్ బలమైన శక్తీగా నిలబడాలన్నా.. ఈ దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దిక్సూచి. ఉత్తరాదిలో బీజేపీకి ఉన్న ఆధిక్యతను తట్టుకోవాలంటే, దక్షిణాదిలో కాంగ్రెస్ తన కోటలను పటిష్టంగా కాపాడుకోవాలి. ఇందులో ఏ ఒక్క రాష్ట్రం చేజారినా, అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నైతిక బలాన్ని దెబ్బతీస్తుంది మరియు రాహుల్ గాంధీ లీడర్‌షిప్‌ను ప్రశ్నార్థకం చేస్తుంది.  రేవంత్ రెడ్డి మాస్ లీడర్‌షిప్, డీకే శివకుమార్ చాణక్యం, సునీల్ కనుగోలు తెరవెనుక నడిపే టెక్నోక్రాట్ వ్యూహాలు   ముక్కోణపు శక్తీగా మారి పని చేయాల్సి ఉంది. దేశంలో ఎవరూ సాధించలేని విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలపై వచ్చే సహజ సిద్ధమైన ప్రజా వ్యతిరేకతను తుడిచిపెట్టేలా వీరు ముగ్గురు కలిసి చేసే రాజకీయ ప్రయోగం సఫలమైతే.. అది కేవలం ఈ రెండు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, రాహుల్ గాంధీని దిల్లీ గద్దె వైపు నడిపించే ఒక బలమైన పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget