అన్వేషించండి

CM Vijay Local Body Elections: స్థానిక పోరుకు సీఎం విజయ్ స్టాప్‌ బటన్ ! వెనక్కి తగ్గుతున్నారా? లేక క్యాడర్ బలాన్ని పెంచుకునే వ్యూహమా?

TVK Vijay : తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు విజయ్. గ్రామస్థాయిలో క్యాడర్ లేకపోవడమే దీనికి కారణం. అన్నాడీఎంకే క్యాడర్‌ను చేర్చుకున్న తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

DMK vs TVK Vijay Politics:   తమిళనాడు రాజకీయ వేదికపై విప్లవాత్మక మార్పులతో అధికారాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్, ప్రతిపక్షాలకు చిక్కని కొత్త వ్యూహానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదనే వార్తలు కొద్దిరోజులుగా ప్రచారంలోకి వచ్చాయి. పంచాయతీ, మునిసిపాలిటీ స్థాయిల్లో ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే పార్టీకి మైలేజ్ కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనే అంచనాలతో  ఎన్నికలను కనీసం ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని సీఎం విజయ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

విజయ్ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం

ఈ వ్యూహాత్మక వెనుకంజ వెనుక ఉన్న అసలు కారణం.. టీవీకేకి క్షేత్రస్థాయిలో ఉన్న బలహీనమైన సంస్థాగత నిర్మాణమే . అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్టార్ పవర్, యువత ఓట్లు ,  కొత్త మార్పును కోరుకున్న ఓటర్ల మద్దతుతో టీవీకే ఘనవిజయం సాధించినప్పటికీ, గ్రామ స్థాయిలో క్రియాశీలక నాయకత్వం, బూత్ స్థాయి నెట్‌వర్క్ ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. అసెంబ్లీ ,  పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం అధినేత ఇమేజ్, రాష్ట్రస్థాయి అంశాలు సరిపోతాయి కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా క్షేత్రస్థాయి వ్యక్తిగత పరిచయాలు, బలమైన కార్యకర్తల జాలంపైనే ఆధారపడి ఉంటాయి. ఈ సమయంలో స్థానిక పోరుకు వెళ్తే గ్రామీణ స్థాయిలో ఉన్న క్యాడర్ లోపం బయటపడే అవకాశం ఉంది.

గ్రామస్థాయిలో బలంగా డీఎంకే

మరోవైపు, పరాజయం పాలైనప్పటికీ ఇప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం, గ్రామీణ స్థాయిలో బలమైన స్థానిక బూత్ కమిటీలు కలిగిన ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే, తమకున్న కేడర్ బలంతో డీఎంకే క్షేత్రస్థాయిలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ప్రతిపక్ష డీఎంకే గనుక స్థానిక పోరులో పైచేయి సాధిస్తే,  టీవీకే గెలుపు కేవలం తాత్కాలిక వేవ్‌ లేదా హైప్ మాత్రమే.. క్షేత్రస్థాయిలో వాళ్లకు ఎలాంటి పునాది లేదు అని విస్తృతంగా ప్రచారం చేసి విజయ్ ప్రభుత్వ ఇమేజ్‌ను మొదటికే మోసం చేసేలా కౌంటర్ ఇచ్చే ప్రమాదం ఉందని అధికార పక్షం భావిస్తోంది.

ముందుగా ఉపఎన్నికలపై దృష్టి 

ఈ ముప్పును ముందుగానే గ్రహించిన సీఎం విజయ్, ముందుగా రాబోయే అసెంబ్లీ ఉపఎన్నికలపై దృష్టి సారించి, స్థానిక సంస్థల పోరును ఏడాది పాటు పక్కన పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ లోపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, వార్డులో టీవీకే కమిటీలను పటిష్టం చేసి, కొత్త రక్తాన్ని నింపి, శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ స్థాయిల్లో డీఎంకేను ఢీకొట్టేలా వ్యవస్థను నిర్మించుకున్న తర్వాతే బరిలోకి దిగడం సురక్షితమని, ఆలోపు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల్లో మరింత ఆదరణ పెంచుకోవాలని టీవీకే నాయకత్వం భావిస్తోంది. ఎన్నికలను వాయిదా వేసే యోచన వెనుక భయం కంటే రాజకీయ చాతుర్యమే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రత్యర్థుల బలమైన ప్రాంతంలో తొందరపడి అడుగుపెట్టి దెబ్బతినడం కంటే, సమయం తీసుకుని సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాకే యుద్ధానికి వెళ్లడం విజయ్ రాజకీయ పరిణతికి నిదర్శనంగా మారింది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget