అన్వేషించండి

Telangana Congress Internal Rebellion: రేవంత్ రెడ్డి - ప్రత్యర్థులపై బలవంతుడు .. సొంత ఇంట్లో బలహీనుడు !?

evanth Reddy Strength and Weakness: రేవంత్ రెడ్డి బయట ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటున్నా సొంత పార్టీ నేతల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులే దానికి సంకేతం.

Opposition Attacks vs Congress Internal Dissent:  తెలంగాణ రాజకీయంలో ప్రత్యర్థులు మొత్తం ఏకమై ఒక అధికార నాయకుడిపై కేంద్రీకృత దాడి చేస్తుంటే, అది ఆ నాయకుడి రాజకీయ బలాన్ని, ప్రభావాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఆ కోణంలో చూస్తే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  అత్యంత బలమైన నేత. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ తమ వ్యూహాలన్నింటినీ రేవంత్ చుట్టూనే తిప్పుతూ, ఆయనను వ్యక్తిగతంగా, రాజకీయంగా కట్టడి చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ ను టార్గె్ట చేస్తున్నాయి.  ఈ ముప్పేట దాడిని ఎదుర్కొంటూనే తన మార్కు దూకుడును ప్రదర్శించడం రేవంత్‌లోని అసలైన బలానికి సంకేతం.

సొంత పార్టీలో రేవంత్‌కు వ్యతిరేకత

అయితే, అదే సమయంలో సొంత పార్టీ నాయకులే బహిరంగంగా తన నాయకత్వాన్ని, నిర్ణయాలను సవాలు చేయడం రేవంత్ రెడ్డిలోని ప్రధాన బలహీనతను బయటపెడుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ నేరుగా సీఎం మరియు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు గుప్పించడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , చిన్నారెడ్డి  వంటి సీనియర్లు ప్రభుత్వ వైఖరిని బహిరంగంగా విమర్శించడం కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికి మించిన క్రమశిక్షణా రాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. శత్రువుల దాడిని తట్టుకోగల నేత, సొంత గుడారంలోని అసమ్మతి మంటలను ఆర్పలేకపోవడం ఆయన అధికారాన్ని పలచన చేస్తోంది.  ప్రత్యర్థుల దాడులకు ఎంత గట్టిగా కౌంటర్ ఇస్తున్నారో, సొంత పార్టీ నేతల ఆశలు, ఆకాంక్షలను సంతృప్తి పరచడంలో రేవంత్ అంతగా విఫలమవుతున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
 
పార్టీలో పట్టు పెంచుకోలేకపోయిన రేవంత్ 

ఇతర పార్టీల నేతలతో పోటాపోటీగా, పక్కా వ్యూహంతో రాజకీయం చేయడం రేవంత్ రెడ్డి నైజం. కానీ, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ జెండా మోసిన పాత కాంగ్రెస్ నేతలు  నిరాశను, వారి పదవుల ఆకాంక్షలను, జిల్లా రాజకీయాల్లో వారి పట్టును బ్యాలెన్స్ చేయలేకపోవడం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత, సీనియర్లకు దక్కడం లేదనే భావన కాంగ్రెస్ కేడర్‌లో అసంతృప్తికి దారితీస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన మూడేళ్ల వ్యవధిలోనే, ఈ అంతర్గత వివాదాలు రోడ్డుకెక్కడం అనేది కాంగ్రెస్ సమన్వయ లోపానికి నిదర్శనం. విపక్షాలను ఎదుర్కొనే శక్తివంతమైన ప్రతి వ్యూహాన్ని రేవంత్ సిద్ధం చేసుకుంటున్నప్పటికీ, పార్టీని ఒక్కటిగా నడిపించడంలో ఆయన  బలహీన ముఖ్యమంత్రి గా కనిపిస్తున్నారనే అభిప్రాయం పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు?

ఈ రెండు వైరుధ్యాలను రేవంత్ రెడ్డి ఎలా బ్యాలెన్స్ చేస్తారనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సొంత పార్టీలోని అసమ్మతి నేతలకు కఠిన సంకేతాలు పంపడం లేదా వారిని నమ్మకంలోకి తీసుకోవడం ద్వారా మాత్రమే రేవంత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలరు. అలా కాకుండా అంతర్గత పోరును నిర్లక్ష్యం చేస్తే, అది విపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా మారి సీఎం హోదాను మరింత బలహీనపరిచే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Internal Rebellion: రేవంత్ రెడ్డి - ప్రత్యర్థులపై బలవంతుడు .. సొంత ఇంట్లో బలహీనుడు !?
రేవంత్ రెడ్డి - ప్రత్యర్థులపై బలవంతుడు .. సొంత ఇంట్లో బలహీనుడు !?
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Minister Konda Surekha: కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Embed widget