అన్వేషించండి

Revanth Reddy support to TDP cadre Telangana: రేవంత్ ఎన్టీఆర్ జపం - గ్రేటర్ ఎన్నికల లక్ష్యంగా మాస్టర్ ప్లాన్.. టీడీపీ ఓట్ బ్యాంక్‌పై కాంగ్రెస్ గురి!

NTR statue inauguration: తెలంగాణ సీఎం రేవంత్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనుక ఉన్న చాలా పెద్ద పొలిటికల్ ప్లాన్ ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఆయన ఏకపక్షంగా పొందాలనుకుంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహం.
  • వలసదారుల, టీడీపీ అభిమానుల ఓట్లను కాంగ్రెస్‌కు మళ్లించే ప్రయత్నం.
  • ఎన్టీఆర్ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పథకాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం.
  • గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలోపేతమే రేవంత్ రెడ్డి లక్ష్యం.

Revanth Reddy NTR strategy GHMC elections 2026: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడూ  ఒక దెబ్బకు రెండు పిట్టలు  అన్న చందంగా ఉంటాయి. తాజాగా అమీర్‌పేట మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉదంతం కేవలం ఒక విగ్రహావిష్కరణగా కాకుండా, రాబోయే జీహెచ్‌ఎంసీ  ఎన్నికల కోసం ఆయన వేసిన భారీ రాజకీయ స్కెచ్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.  
 
ఎన్టీఆర్ నామం.. రేవంత్ వ్యూహం 

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి, గతంలో ఎన్టీఆర్ తో ఉన్న ఉన్న కాంగ్రెస్ వైరం చరిత్రను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ జపం చేయడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం సానుభూతిపరులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటంతో, ఆ పార్టీ  కోర్ ఓట్ బ్యాంక్  అనాథగా మారింది. ఈ శూన్యాన్ని భర్తీ చేసి, ఆ ఓట్లను కాంగ్రెస్ ఖాతాలోకి మళ్లించడమే రేవంత్ అసలు లక్ష్యం.

 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

2

ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

3

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

4

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

5

భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

 సంప్రదాయ వ్యతిరేకతకు చెక్ 

సాధారణంగా తెలుగుదేశం సానుభూతిపరులు మొదటి నుంచీ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పెరిగిన వారు. ఎన్టీఆర్ పెట్టిన కాంగ్రెస్ వ్యతిరేక పునాదులే వారి రాజకీయ సిద్ధాంతం. మరి అలాంటి వారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటే, ఆ పార్టీలో తమకు  నచ్చిన  వ్యక్తి ఉండాలి. రేవంత్ రెడ్డి సరిగ్గా ఆ పల్స్‌ను పట్టుకున్నారు. తాను కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ, తన రాజకీయ మూలాలు ఎన్టీఆర్ సిద్ధాంతాల్లోనే ఉన్నాయని, ఇప్పటికీ చంద్రబాబు పట్ల తనకు గౌరవం ఉందని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. చంద్రబాబును ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించకపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే.

 టీడీపీ క్యాడర్‌లో రేవంత్  క్రేజ్ 

తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ రేవంత్ రెడ్డిని  మనవాడే అని భావిస్తుంది.   ఇప్పుడు మైత్రివనం వంటి అత్యంత రద్దీ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అటు సెటిలర్లను, ఇటు టీడీపీ అభిమానులను రేవంత్ తన వైపు తిప్పుకున్నారు.  మా పార్టీ నాయకుడు కాకపోయినా, మా దైవానికి గౌరవం ఇచ్చారు అనే భావనను టీడీపీ శ్రేణుల్లో కలిగించడంలో రేవంత్ నూటికి నూరు శాతం విజయం సాధించారు. ఎన్టీఆర్‌ను  తెలుగు జాతి గర్వకారణం గా కీర్తిస్తూ, ఇటు తెలంగాణ వాదులను ఇబ్బంది పెట్టకుండానే అటు సెటిలర్ల మనసు గెలుచుకుంటున్నారు. దీనివల్ల గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడే సెంటిమెంట్ కార్డు ఇకపై పనిచేయదు. పైగా,  ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ ఎక్కడ  అని రేవంత్ ప్రశ్నించడం ద్వారా బీఆర్ఎస్ అధినేతను డిఫెన్స్‌లో పడేశారు.

 గ్రేటర్ పీఠమే లక్ష్యం 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష లాంటివి. నగరంలో కాంగ్రెస్ బలపడాలంటే టీడీపీ సానుభూతిపరుల మద్దతు అనివార్యం. అందుకే, ఆయన వ్యూహాత్మకంగా తన ప్రసంగాల్లో ఇందిరా గాంధీతో పాటు ఎన్టీఆర్ పేరును కూడా సమానంగా వాడుతున్నారు.  ఎన్టీఆర్ ప్రారంభించిన పక్కా ఇళ్ల పథకమే.. ఈనాటి ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పడం ద్వారా రెండు పార్టీల సిద్ధాంతాలను ఒకే తాటిపైకి తెచ్చారు. ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ ఇచ్చే అంశం. రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికం కాదు. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వెనుక ఉన్నది కేవలం అభిమానం మాత్రమే కాదు, పక్కాగా లెక్కగట్టిన  పొలిటికల్ అరిథ్మెటిక్ . టీడీపీ ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే, గ్రేటర్ హైదరాబాద్‌లో తిరుగులేని శక్తిగా ఎదగవచ్చని ఆయన భావిస్తున్నారు. మరి రేవంత్ వేసిన ఈ విగ్రహ రాజకీయం ఓట్ల రూపంలో ఎంతవరకు మారుతుందో రాబోయే ఎన్నికలు తేల్చనున్నాయి. 


 

Frequently Asked Questions

రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం వెనుక రాజకీయ కారణం ఏమిటి?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం, తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను కాంగ్రెస్ ఖాతాలోకి మళ్లించడమే రేవంత్ రెడ్డి అసలు లక్ష్యం.

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి?

రేవంత్ రెడ్డి, తాను కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ, తన రాజకీయ మూలాలు ఎన్టీఆర్ సిద్ధాంతాల్లోనే ఉన్నాయని, చంద్రబాబు పట్ల గౌరవం ఉందని సంకేతాలిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీ క్యాడర్‌లో రేవంత్ రెడ్డికి ఆదరణ ఉందా?

అవును, తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ రేవంత్ రెడ్డిని 'మనవాడే' అని భావిస్తుంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో వారి మనసు గెలుచుకున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఈ వ్యూహం ఎలా ఇబ్బంది కలిగిస్తుంది?

ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ, తెలంగాణ వాదులను ఇబ్బంది పెట్టకుండా సెటిలర్ల మనసు గెలుచుకుంటున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ వాడే సెంటిమెంట్ కార్డు పనిచేయదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget