By: ABP Desam | Updated at : 21 Jul 2022 03:07 PM (IST)
త్వరలో తెలంగాణలో మహారాష్ట్ర రాజకీయం - దమ్ముంటే ఆపుకోవాలని కేసీఆర్‌కు రాజా సింగ్ సవాల్ !
BJP Rajasingh : తెలంగాణలోనూ మహారాష్ట్ర రాజకీయం రిపీటవుతుందని బీజేపీ నేతలు టీఆర్ఎస్ కు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే చెబుతున్నారు. త్వరలో మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో రాబోతున్నాయని సీఎంకు ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే ఆపాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ భయం పట్టుకుందని అందుకే ఆయన తెలంగాణ వస్తే కేసీఆర్ ఏవో పనులు కల్పించుకుని తప్పించుకు తిరుగుతుంటారు అంటూ ఎద్దేవా చేశారు.
శ్రీలంక నుంచి రాష్ట్రాలు గుణపాఠాలు నేర్చుకోవాలని సలహలు - కేంద్రానికి బాధ్యత లేదా !?
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రజల గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులు ఎప్పుడు ఊడుతాయో తెలియని అయోమయంలో ఉన్నారన్నారు. రాష్ట్రానికి రెండేళ్లుగా ఇచ్చిన 500 కోట్ల వరదసాయం సీఎం కేసీఆర్ దేని కోసం ఖర్చు చేశారో.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల కడుపు నింపేందుకు.. సీఎం కేంద్రాన్ని వరదసాయం అడుగుతున్నారని ఎద్దేవ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో 10వేలు ఇస్తామని చెప్పి.. టీఆర్ఎస్ కార్యకర్తలకు పంచి పెట్టారని గుర్తు చేశారు రాజాసింగ్... జిఎస్టీ అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బోధన్ మండలం నర్సాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేసిన రాజాసింగ్.. బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 10 రోజుల పాటు నియోజకవర్గం మొత్తం పర్యటిస్తానన్నారు.
పోలవరం కేంద్రంగా మళ్లీ విభజన సెంటిమెంట్ పాలిటిక్స్ - వర్కవుట్ అవుతుందా ?
టీఆర్ఎస్ ను టీజ్ చేయడానికి మహారాష్ట్ర ఎపిసోడ్‌ను బీజేపీ వాడుకుంటోంది. ఆపరేషన్ ఆకర్ష్ కోసం ప్రత్యేకంగా ఈటల రాజేందర్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. కానీ ఇప్పటి వరకూ ఆ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరగలేదు. ఇటీవల ఆ పార్టీలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది టీఆర్ఎస్ నేతలు చేరుతున్నారు. కానీ బీజేపీలో చేరలేదు. అయితే ఏక్ నాథ్ షిండేలా సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నారేమో తెలియదు కానీ.. ఇలా టీఆర్ఎస్‌ను మహారాష్ట్రతో పోల్చి బెదిరించే పరిస్థితి మాత్రం పెరిగిపోయింది. ఈ హెచ్చరికలపై గతంలో కేసీఆర్ కూడా స్పందించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు స్పందించడం మానేశారు.
మెగస్టార్ బర్త్‌డే రోజున జనసేన కీలక భేటీ- కేడర్‌కు ఏం చెప్పబోతున్నారు?
Munugode News: మూడు పార్టీల వ్యూహంలో మునుగోడు, ఒకరికి మించి మరొకరి వ్యూహాలు - రంగంలోకి అమిత్ షా
కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ
AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా