Rajagopal Reddy : డైలమాలో రాజగోపాల్ రెడ్డి ! బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్యే !
డైలమాలో రాజగోపాల్ రెడ్డి, బీజేపీలో చేరికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. రెండు రోజుల నుంచి రాజకీయంగా సంచలనం రేపుతున్న ఆయన అటో ఇటో తేల్చి చెప్పడం లేదు. ఆయన వ్యవహారాల కారణంగా అటు బీజేపీ పెద్దలు.. ఇటు కాంగ్రెస్ పెద్దలు అత్యవసర సమావేశాలు పెట్టుకుని రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ రాష్ట్ర నేతల్ని కలిసి పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధత తెలుపాల్సి ఉంది. కానీ ఆయన హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు.
కేంద్రం కంటే మెరుగ్గా ఏపీ ఆర్థిక పరిస్థితి - లెక్కలు రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !
తనను సంప్రదించిన బీజేపీ నేతలకు మరో వారం రోజుల సమయం అడిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ నేతలు ఉసూరుమన్నారు. బీజేపీలో చేరడం.. ఆయన రాజీనామా చేయడం.. ఆ తర్వాత ఉపఎన్నిక రావడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ఏ అయోమయంలో ఉన్నారో ఇప్పుడూ అంతే ఉన్నారు. బీజేపీలో చేరుతానని ఎప్పట్నుంచో చెబుతున్నారు. కానీ చేరడం లేదు. ఇప్పుడూ అదే డైలమాలో ఉన్నారు.
మరో వైపు మునుగోడులో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డినే నిలబెడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన తనకు పోటీగా నిలబడితే కుటుంబంలో వివాదాలు వస్తాయి. నిలబడకపోతే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విలువ లేకుండా పోతుంది. ఈ కారణంగా తన రాజీనామా వల్ల రాజకీయంగా ఎంత లాభమో రాజగోపాల్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారని కానీ స్పష్టత రాకపోవడంతో డైలమాలో ఉన్నారని చెబుతున్నారు. నిజానికి మునుగోడులో ఆయన అనుచరులు కూడా పార్టీ మార్పుపై పాజిటివ్‌గా స్పందించడం లే్దు.
టీఆర్ఎస్ ఓకే అంటేనే ఉపఎన్నికలు - ఈ లాజిక్ బీజేపీ మిస్సవుతోందా ?
తాను రాజీనామా చేసి ఉపఎన్నికలు తె్సేత బీజేపీకి ఉపయోగపడే రాజకీయంగా ఉపయోగపడుతుంది. అయితే సొంత ఇంట్లో కుంపటి పెట్టుకున్నట్లు అవుతుంది. అదే సమయంలో ఆయన ఎన్నికల ఖర్చు గురించి కూడా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉపఎన్నిక వస్తే.. ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఊహించడం ఆయనకు కష్టమేం కాదు. సర్వెశక్తులు ఒడ్డే టీఆర్ఎస్..తాడోపేడో తేల్చుకోవాలనుకునే కాంగ్రెస్ ఏ మాత్రం తగ్గవు. వారికి పోటీగా రాజగోపాల్ రెడ్డి కూడా ఖర్చు పెట్టాలి. అలా భారీగాఖర్చు పెట్టుకుని గెలిస్తే పదవి ఉండేది మరో ఎడెనిమిది నెలలు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో మళ్లీ ఖర్చు పెట్టుకోవాలి. అందుకే రాజగోపాల్ రెడ్డి డైలమాలో ఉన్నారంటున్నారు.