By: ABP Desam | Updated at : 28 Jul 2022 03:01 PM (IST)
ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందన్న విజయసాయిరెడ్డి
YSR Congress MPS : ఆంధ్రప్రదేశ్ సమర్థ నాయకత్వం చేతుల్లో ఉందని .. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీలు పలు కీలక అంశాలపై స్పందించారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఒకరకంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందన్నారు.
కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సెస్, సర్‌ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం పంచడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఆత్మపరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది. చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం సీఎం జగన్ గారి లాంటి సమర్థ నాయకుడి చేతిలో ఉంది. ఒకరకంగా కేంద్రం కంటే ఏపీ ఆర్థిక పరిస్థితే మెరుగ్గా ఉంది. pic.twitter.com/va0owgPFGb
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2022
2014-19లో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే , చంద్రబాబు హాయంలో రాష్ట్రంలో 117 శాతం అప్పులు పెరిగాయి. కేంద్రం 2019 నుంచి ఇప్పటి వరకు 50 శాతం అప్పులు చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయన్నారు. నాటి చంద్ర బాబు ప్రభుత్వం అయిదుగురు కోసం పని చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పని చేస్తుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో తాము విజయవంతం అయ్యామని మరో ఎంపీ మిధున్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారులకు ఏ రాష్ట్రానికీ రానన్ని నిధులు ఏపీకి వచ్చాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకు రావడంలో ఎంపీలందరం సమిష్టిగా పని చేస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలో సురక్షిత జలాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ అరెస్ట్
Andhra Pradesh: న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
TTD News: అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప స్వామి
Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు
Central Team Inspection: సీఎం జగన్ లెక్కలు తేల్చడానికి కేంద్రం బృందం, రేపే రాష్ట్రానికి రాక!
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత
/body>