అన్వేషించండి

Telangana Municipal Elections 2026: ఫలితాలు రాక ముందే పొలిటికల్ గేమ్ - చైర్మన్ పీఠాల కోసం క్యాంప్ రాజకీయాల జోరు!

Political game: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాక ముందే క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. 16 వ తేదీ వరకూ తెలంగాణలో పొలిటికల్ గేమ్ సాగనుంది.

Political game before results Camp politics  Start: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం, దానికి తోడు స్వతంత్ర అభ్యర్థులు   అనూహ్య రీతిలో ప్రభావం చూపుతుండటంతో ఫలితాలు వెలువడక ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఉత్కంఠ రేపుతున్న స్వతంత్ర అభ్యర్థుల పాత్ర                               

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో  మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించడం ఏ ఒక్క పార్టీకి అంత సులభంగా కనిపించడం లేదు. అనేక చోట్ల  స్వతంత్ర అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశం ఉండటంతో, వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగానే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఫలితాల అనంతరం బేరసారాలకు తావు లేకుండా ఉండేందుకు, అభ్యర్థులను ఇతర పార్టీల వారు సంప్రదించకుండా అప్పుడే రహస్య ప్రాంతాలకు తరలించే  క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి.

 వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన పార్టీలు                               

అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా, ఉనికిని చాటుకోవడానికి బిఆర్ఎస్, పట్టణ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న బిజెపి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా ఉండటానికి పార్టీ అధిష్ఠానాలు ప్రత్యేక పరిశీలకులను నియమించాయి. కొన్ని మున్సిపాలిటీల్లో ఫలితాల సరళిని బట్టి, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఆకర్షించేందుకు  ఆకర్ష్  మంత్రం కూడా సిద్ధం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫలితాల ముందే మొదలైన తరలింపు                         

ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను రిసార్టులు, పక్క రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా హంగ్ ఏర్పడే అవకాశం ఉన్న మున్సిపాలిటీలపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. చైర్మన్ పీఠం దక్కాలంటే ఒక్కో ఓటు విలువైంది కావడంతో, అభ్యర్థులకు భారీ ఆఫర్లు, పదవుల ఎర వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ ఉత్కంఠ మరింత పెరగనుంది. ఫిబ్రవరి 16న జరిగే మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎటు మలుపు తిరుగుతాయో చూడాలి.  మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఓట్ల లెక్కింపుకే పరిమితం కాకుండా, తెరవెనుక సాగే వ్యూహాలు, క్యాంప్ రాజకీయాలకు వేదికగా మారాయి.                                             

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget