అన్వేషించండి

Revanth Reddy Chit Chat: పదిన్నరేళ్లు నేనే సీఎం - ఢిల్లీలో రేవంత్ చిట్ చాట్ - ఈ లెక్కేంటో తెలుసా?

CM Revanth Chit Chat: పదిన్నర సంవత్సరాల తానే సీఎంగా ఉంటానని రేవంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పలు కీలక అంశాలపై మాట్లాడారు.

Revanth Reddy Chit Chat in Delhi: తెలంగాణ రాజకీయాల్లో తనకు ఎదురులేదని  రాష్ట్రానికి నేనే రాజు.. నేనే మంత్రిని.. నాకు ఎవరూ పోటీ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన  జాతీయ మీడియా ప్రతినిధఉలతో  ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ఆయన పాలన, భవిష్యత్తు రాజకీయాలు మరియు జమిలి ఎన్నికలపై అత్యంత ధీమాతో చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్ అయ్యాయి.  

వచ్చే పదిన్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠంపై తానే ఉంటానని, పాలనలో తన ముద్రను మరింత బలంగా వేస్తానని ధీమా వ్యక్తం చేశారు. పదిన్నరేళ్ల లెక్క ఏమిటంటే.. వచ్చే ఎన్నికలు 2028లో జరగబోవని 2029లో జమిలీగానే జరుగుతాయని.. అప్పటి వరకూ తానే సీఎంగా ఉంటానని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను కొట్టిపారేస్తూ, తన నాయకత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న  జమిలి ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు. 2029లో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతకంటే ముందు దేశంలో జనగణన , నియోజకవర్గాల పునర్విభజన , పార్లమెంట్ సీట్ల పెంపు ,మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుందని వివరించారు. ఈ పరిణామాలన్నీ ముగిసిన తర్వాతే దేశం ఒకే సారి ఎన్నికలకు వెళ్తుందని ఆయన విశ్లేషించారు.
 
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఇది రాజకీయ సమీకరణాలను మారుస్తుందని రేవంత్ పేర్కొన్నారు. సీట్ల పెంపు తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని, అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావుపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్ జాతి ఆస్తి, ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదు.. ఆయనొక నేషనల్ లీడర్" అని అభివర్ణించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు.  . కేసీఆర్ ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహ నిర్బంధంలో ఉన్నారని ఎద్దేవా చేసిన రేవంత్, తాను ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని, ఇతరుల వ్యక్తిగత విషయాలు వినడం మానసిక క్షోభ అని స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పష్టమైన టైమ్ లైన్ ప్రకటించారు. మార్చి 31 లోపు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ మరియు వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించడం ద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సింగరేణి సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా చర్చ జరిపి అన్ని విషయాలను బహిర్గతం చేస్తామని చెప్పారు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ, అనాలసిస్ పూర్తయ్యాక అక్కడ ఆధారాలు ఉండవని సాంకేతిక అంశాన్ని వివరించారు.
 
కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ వైఖరిని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఇప్పుడు ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు.  తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు  అని చెబుతూనే, నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని సూచించారు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒకే విధానం ఉండాలని కోరారు. అలాగే మహబూబ్ నగర్ హత్యారాజకీయాల ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఒక కౌన్సిలర్ కోసం అటువంటి పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరినైనా జైల్లో వేయాలనుకుంటే తాము చట్టప్రకారం, నిబంధనలకు లోబడే ముందుకు వెళ్తామని, రాజ్యాంగం ప్రకారమే తన నడక ఉంటుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తొలి అంకానికి చేరిందని, విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి 20 నెలలు పట్టిందని, ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై స్పందిస్తూ, కేవలం కుంగిన మూడు గేట్లే కాకుండా మొత్తం ప్రాజెక్టును అధ్యయనం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని, నిపుణుల కమిటీ నివేదిక రాకుండా కేసీఆర్, హరీష్ రావు కోరినట్లు తాము తొందరపడి నిర్ణయాలు తీసుకోమని రేవంత్ తేల్చి చెప్పారు.   ఫార్ములా రేస్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎందుకు స్పందించడం లేదని, సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ.. కేటీఆర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
 
దేశంలో ఎన్నికల సంస్కరణలపై రేవంత్ రెడ్డి కీలక విశ్లేషణ చేశారు. 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి ఒక కాలక్రమ పట్టికను కూడా ఆయన వివరించారు. 2027 మే లేదా జూన్ నాటికి జనాభా లెక్కలు తేలుతాయని, 2028 నాటికి మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశారు. ఇక పార్టీ పరంగా కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు.  
 

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget