KTR Twitter : ట్విట్టర్‌లో కేటీఆర్ కు రిప్లై పెడితే సమస్య పరిష్కారం అయిపోతుందా ? కేటీఆర్ ట్వీట్‌కు ఎందుకంత క్రేజ్ ?
తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎక్కువగా కేటీఆర్ ను ట్విట్టర్‌లో సంప్రదిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారిలో భరోసా కనిపిస్తోంది.
KTR Twitter : సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన సాయం చేస్తూ ఉంటారు. ప్రజల సమస్యలు తీర్చడమే కాదు ఆయన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ ట్వీట్ కింద కామెంట్లు మాత్రం అత్యధికం ప్రజలు తమ సమస్యలు చెప్పడానికే ఉపయోగించారు. అంటే.. కేటీఆర్ ట్విట్టర్ ను సమస్యల పరిష్కారానికి ఓ సాధనంగా ఉపయోగించుకుంటున్నారన్నమాట.
#Rowing pic.twitter.com/22W4ssESBP
— KTR (@KTRTRS) December 23, 2022
ట్విట్టర్ ద్వారా అనేక మంది సమస్యలు పరిష్కరిస్తున్న కేటీఆర్
మంత్రి కేటీఆర్ ప్రజలకు దగ్గరగా ఉండటానికి ట్విట్టర్‌ను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన తన పర్సనల్ ట్విట్టర్ @KTRTRS హ్యాండిల్‌తో పాటు @KTRoffice ఆఫీస్ ఆఫ్ కేటీఆర్ హ్యాండిల్‌ను కూడా తన టీంతో మెయిన్‌టెయిన్ చేస్తూంటారు. తన అధికారిక మంత్రిత్వశాఖ హ్యాండిల్ ఎలాగూ ఉంటుంది. వీటన్నింటికీ ఆయనకు పెద్ద ఎత్తున రిక్వెస్టులు వస్తూ ఉంటాయి. చాలా వరకూ రియల్‌గా అవసరం .. సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని గుర్తించి.. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని .. తన ఆఫీసుకు రిఫర్ చేస్తూంటారు కేటీఆర్. దీని వల్ల అనేక వందల మందికి సాయం అందింది. కేటీఆర్ ఇలా వేగంగా స్పందిస్తూడటంతో ఆయనకు రిక్వెస్టులు పెట్టే వారు కూడా అంతకంతకూ పెరుగుతున్నారు.
కేటీఆర్ కు వచ్చే విజ్ఞప్తులను పరిశీలించడానికి ప్రత్యేకంగా టీమ్
తనను సహాయం అడిగిన వారికి లేదనకుండా చేసేందుకు ప్రయత్నిస్తూంటారు. ఆయనను నేరుగా కలవడం ఈ కాలంలో సాధ్యం కాదు. అందుకు ఉన్నఒకే ఒక్క మార్గం సోషల్ మీడియా. ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే కేటీఆర్‌కు.. ఆ మాధ్యమం ద్వారానే ఎక్కువ మంది సహాయంచేయమని అడుగుతున్నారు. కేటీఆర్ కూడా.. అదే చెబుతున్నారు. తనను ట్విట్టర్ ద్వారా సంప్రదించమని అంటున్నారు. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్.. వాటికి వచ్చే ఫిర్యాదులు.. విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా టీమ్‌ను నియమించుకున్నారు. ఆ టీమ్ ఎప్పటికప్పుడు చురుగ్గా అప్ డేట్ చేస్తోంది. తెలంగాణ ప్రజలు ఎక్కువగా కేటీఆర్‌కు వైద్య సాయం కోసమే ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని కేటీఆర్ వేగంగా పరిష్కరిస్తూ ఉంటారు. ఒక వేళ ఆయన రిఫర్ చేయకపోయినా ఆయన టీమ్ వెంటనే టేకప్ చేస్తుంది.
ఏలాంటి ట్వీట్ చేసినా సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తుల వెల్లువ
అయితే ఈ ట్విట్టర్ వల్లే ఎక్కువ ఎఫెక్ట్ ఉందని భావిస్తున్న బాధితులు ఎక్కువగా నేరుగా కేటీఆర్ నే సంప్రదిస్తున్నారు.దీంతో కేటీఆర్ ట్వీట్లకు వచ్చే రెస్పాన్స్ అంతా ప్రభుత్వ సాయం కోసం చూసేవారివే ఉంటున్నాయి. తాజాగా కేటీఆర్ జిమ్ చేస్తున్న విషయాన్ని షేర్ చేసినా వెల్లువలా అవే విజ్ఞప్తులు వచ్చాయి.
అన్నా నా కొడుకుకి రెయిన్బో హాస్పిటల్ లో హార్ట్ సర్జరీ ఉందన్న మా అబ్బాయికి ఏంటంటే రైట్ సైడ్ ఉన్నది హార్టు.ప్రతి ఒక్కరికి హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటది కదా అన్న.మా అబ్బాయికి రైట్ సైడ్ ఉందన్న హార్ట్.అన్న జనవరి 5 గాని 6 గాని సర్జరీ చేయించాలన్న అన్న.మీరే కొంచెం సాయం చేయండి అన్నా.🙏🙏🙏🙏 pic.twitter.com/PjvRjZQlfO
— Narsimha (@Narsimh11990288) December 23, 2022
Today's situation at Ghatkesar Bus stop. 1 bus is towards Edulabad 280E another towards Bogaram 280B@DonitaJose @amrxxer @YounusFarhaan pic.twitter.com/UIAiWFmURu
— Naseer Nashu 🇮🇳 (@naseernashu0408) December 22, 2022
సోషల్ మీడియా విజ్ఞప్తులతో సమస్యలు పరిష్కారం అవుతాయా ?
సోషల్ మీడియా ద్వారా వస్తున్న విజ్ఞప్తులకు కేటీఆర్ వేగంగా స్పందిస్తున్నా.. అసలు ఇలాంటి రిక్వెస్టుల్లో అత్యధికంగా ఫేక్ కావడమే సమస్య. సోషల్ మీడియాపై సరైన నియంత్రణ లేకపోవడం... ఇతరులపై ఈర్ష్యతో కూడా కంప్లైంట్లు చేస్తూండటంతో అధికారులకు చిక్కులు వస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాను.. ఉపయోగించుకునేవారి సంఖ్య కూడా పరిమితమని భావింవచ్చు. ట్విట్టర్ పై విద్యావంతులకు మాత్రమే అవగాహన ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలను పక్కనబెడితే ట్విట్టర్ గవర్నెన్స్ వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి పలుకుబడి పెరుగుతోందని.. ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోందని అనుకోవచ్చు.