అన్వేషించండి

Jana Sena expansion : జనసేన విస్తరణకు పవన్ కల్యాణ్ కసరత్తు - దక్షిణాది రాష్ట్రాలన్నింటి నుంచి చేరికలు - సైలెంట్ ఆపరేషన్ జరుగుతోందా?

Pawan Kalyan: ఇతర రాష్ట్రాలకు జనసేనను విస్తరించాలని పవన్ కల్యాణ్ పట్టుదలగా ఉన్నారు. గతంలో కర్ణాటక ఇప్పుడు కేరళ నుంచి పార్టీలో చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు.

Jana Sena expansion to other states: ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అద్భుత విజయం సాధించి, తిరుగులేని శక్తిగా ఎదిగిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన  రాజకీయ విప్లవాన్ని సరిహద్దులు దాటించేందుకు సిద్ధమయ్యారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దాలనే ఆయన  ప్లాన్ ను సైలెంట్ గా అమలు చేస్తున్నారు.  

ప్రాంతీయతను దాటి.. జాతీయవాదం వైపు

సాధారణంగా ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి అడుగు వేయడానికి జంకుతాయి. కానీ, పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ  భారతీయత ను తన సిద్ధాంతంగా ఎంచుకున్నారు. జనసేన కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అదొక సామాజిక భావజాలం అని ఆయన నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కూటమి విజయానికి వెన్నెముకగా నిలిచిన పవన్, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని చాటేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఎన్నికల కోసం కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో  జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు ఇతర రాష్ట్రాల యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.

కేరళలో జనసేన మార్క్  సైలెంట్ రివల్యూష 

విద్యావంతులు, రాజకీయ చైతన్యం అధికంగా ఉండే కేరళ రాష్ట్రంలో జనసేనకు  ఆదరణ లభిస్తోంది.  కేరళకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరారు.  కమ్యూనిస్ట్ , కాంగ్రెస్ కూటముల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కేరళ రాజకీయాల్లో, పవన్ కళ్యాణ్ చెప్పే  సమ్మిళిత అభివృద్ధి  అనే నినాదం కొత్త ఆశలు రేకెత్తిస్తోందని పార్టీలో చేరిన వారు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న పాన్ ఇండియా  ఇమేజ్ , ఆయన నిబద్ధత కేరళ యువతను జనసేన వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని చెబుతున్నారు. 

కర్ణాటక నెట్‌వర్క్.. సేవా పథంలో జనసేన

కర్ణాటకలో ఇప్పటికే జనసేన తన మూలాలను పటిష్టం చేసుకుంది. అక్కడి మాజీ ఎమ్మెల్యే  ఇటీవల పార్టీలో చేరారు.   కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, బెంగళూరు వంటి నగరాల్లో జనసేన వాలంటీర్లు చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్థానికుల్లో మంచి గుర్తింపు తెచ్చాయి. అక్కడి తెలుగువారితో పాటు కన్నడిగులు కూడా జనసేన సిద్ధాంతాలను ఆదరిస్తుండటం, రాబోయే రోజుల్లో కర్ణాటకలో జనసేన ఒక నిర్ణయాత్మక శక్తిగా మారబోతోందన్న దానికి సంకేమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి గొంతుకగా పవన్ కళ్యాణ్

జనసేన విస్తరణ వెనుక ఒక లోతైన జాతీయ వ్యూహం కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్, దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై కేంద్రం వద్ద ఒక ఉమ్మడి వేదికను నిర్మించాలని భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతూనే, దేశ సమగ్రతను కాపాడే ఒక  నేషనల్ పొలిటికల్ ఫోర్స్ గా జనసేనను తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా జనసేన శాఖలు క్రియాశీలం కావడం, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న విషయం  స్పష్టమవుతోంది. 

జనసేన విస్తరణ అనేది కేవలం సంఖ్యాబలం పెంచుకోవడం కోసం కాదు, అది రాజకీయ సంస్కృతిని మార్చడం కోసం. ఇతర రాష్ట్రాల్లో పార్టీని కేవలం నామమాత్రంగా ఉంచకుండా, స్థానిక సమస్యలపై పోరాడేలా కేడర్‌ను సిద్ధం చేయడం పవన్ కళ్యాణ్  లక్ష్యంగా కనిపిస్తోంది.  పవన్ ఆశయాలకు తగ్గట్లుగా ప్రధాన కార్యదర్శి వ్యూహాలు అమలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget