Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
ప్రజా సమస్యల పరిష్కారానికి ఆర్జీలు తీసుకునే కార్యక్రమం జనవాణి ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ప్రతి ఆదివారం పవన్ కల్యాణ్ ఈ జనవాణిలో పాల్గొంటారు.
Janasena Janavani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు భరోసా యాత్ర చేస్తున్న ఆయన .. ఇక ప్రతి ఆదివారం "జనవాణి" అనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. జనవాణి అంటే..ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు తీసుకునే ప్రోగ్రాం.
వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ! సొంత నేతలపైనే కుట్రలు జరుగుతున్నాయా ?
ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారి సమస్యలను పట్టించుకుకునే పరిస్థితిలో లేదని జనసేన అధినేత భావిస్తున్నారు. అలాంటి వారందరికీ అండగా ఉండాలనుకుంటున్నారు. ప్రతి అదివారం.. పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి.. వారి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటి పరిష్కారానికి పార్టీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. నిజానికి స్పందన పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కానీ ఆ దరఖాస్తులు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదని జనసైనికులు భావిస్తున్నారు.
సామాన్యుడి గళం వినిపించేలా 'జన వాణి'
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2022
Video Link: https://t.co/xmAMlIaskh pic.twitter.com/jC93zoJ7Z8
గిరిజన అభ్యర్థి రాష్ట్రపతి పోటీలో నిలబడితే ఇంత ద్వేషమా ? కమ్యూనిస్టులపై ఏపీ బీజేపీ ఆగ్రహం !
ఇటీవల ప్రకాశం జిల్లాలో వికలాంగ దళిత మహిళ ఆర్జీ ఇవ్వడానికి వస్తూంటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి బాధితుల కోసం అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్ జనవాణి చేపట్టాలని నిర్ణయించినట్లుగా జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడో తేదీ నుంచి అంటే వచ్చే ఆదివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి రెండు ఆదివారాలు.. విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తారు. తర్వాత జిల్లాల్లోనూ పర్యటించి ఆర్జీలు తీసుకుంటారు. పవన్ కు విన్నవించుకుంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని.. అందుకే ఆర్జీలు తీసుకుంటామని.. రసీదు ఇస్తామని.. ఆ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు జనసేన ఫాలో అప్ చేస్తుందని ఆ పార్టీ ప్రకటించింది.
ఏపీ బీజేపీ బలపడుతోందా ? ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ?
విజయదశమి నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర నిర్వహిస్తారు. అంతకు ముందే అన్ని జిల్లాల్లోనూ జనవాణిని నిర్వహించాలని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ధసరా నుంచి పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది.