By: ABP Desam | Updated at : 28 Jun 2022 03:50 PM (IST)
కమ్యూనిస్టుల తీరుపై ఏపీ బీజేపీ ఆగ్రహం
AP BJP Fire On Communists : ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిషాకు చెందిన గిరిజన ద్రౌపది ముర్మును నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీలు విమర్శలు చేయడంపై ఏపీ బీజేపీ నేతలు మండి పడుతున్నారు. సిపిఐపార్టీ బలహీన, గిరిజన,ఆదివాసీ వర్గాల ద్రోహిగా మారిందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సి పి ఐ నేత రామకృష్ణ గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి మీద వ్యక్తిగత దూషణలు చేశారని.. ఇలా చేయడం సిగ్గు చేటని విమర్శించారు. గిరిజన అభ్యర్థి రబ్బరు స్టాంపు రాష్ట్రపతి అవుతుంది అని అనడాని రామకృష్ణ గారికి సిగ్గు అనిపించడం లేదా ? అని విష్ణువర్ధన్ రెడ్డి .. సీపీఐ నేత రామకృష్ణను ప్రశ్నించారు.
ఏపీ బీజేపీ బలపడుతోందా ? ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ?
కమ్యూనిస్టులు ను గిరిజన సమాజం నుండి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మహిళల పట్ల కమ్యూనిస్టులు కు చిన్నచూపు ఉందన్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటి సారి గిరిజనులకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వస్తే, అది చూసి ఓర్వలేని కమ్యూనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దేశంలో ఎక్కడా కనీసం ఉనికి లేకపోయినా, ప్రజలు ఛీత్కరించినా వారి ఆలోచనలలో మార్పు రాకపోగా గిరిజనుల మీద తమ ద్వేషాన్ని వెళ్లగక్కడం దురదృష్టకరమన్నారు. సీపీఎం పార్టీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన పార్టీలపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
ధర్మవరంలో నెత్తురు చిందించుకున్న నేతలు, బీజేపీ లీడర్లపై విచ్చలవిడిగా కర్రలతో దాడి
సామాజిక న్యాయం ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే బలపరచిన ఒక గిరిజన మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపటాన్ని విమర్శించాన్ని విష్ణువర్ధన్ రెడ్డి కండించారు. తమ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే సిపిఎం నాయకులు బూజు పట్టిన సిద్ధాంతాలతో ఇలాంటి మహిళా, గిరిజన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంటున్నరాు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న ఎన్డీయేను విమర్శించే అర్హత కమ్యూనిస్టు నాయకులకు ఏమాత్రం లేదన్నారు.
బీజేపీ మనిషిని - తిరుపతి కోర్టు ముందు మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు !
ఎన్డీఏ యేతర పక్షాలైన జార్ఖండ్ జే ఎం ఎం పార్టీ నేత హేమంత్ సోరెన్ ,ఒరిస్సా బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ ,కర్ణాటక జనతాదళ్ (యస్) దేవేగౌడ ఇంకా అనేక పార్టీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్న విషయం కమ్యూనిస్టు పార్టీలకు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి బరిలో విపక్షాల తరపున బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హాకు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి.
KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !
Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !
Revant Corona : రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Stalin Letter To Jagan : ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్‌కు స్టాలిన్ లేఖ !
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
iPhone 14: ఐఫోన్ 14 విషయంలో అవి రూమర్లే - వెలుగులోకి కొత్త వివరాలు!