By: Harish | Updated at : 15 Mar 2023 01:04 PM (IST)
ఏపీ బీజేపీ నేతలపై పవన్ ఆగ్రహానికి కారణం అదేనా ?
Pawan Fire On APBJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలపై పవన్ మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడ్డారు. అసలు ఎదగలేకపోవడానికి ఆ పార్టీనే కారణం అని నిందించారు. అంటే.. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతల పై ఆయన తన అసంతృప్తిని చాలా స్పష్టంగా బయట పెట్టారు. కేంద్ర నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టి నేతలకు క్లారిటి ఉంది కాని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులతో తనకు గ్యాప్ ఉందని ఆయన నేరుగా ప్రకటించటం చర్చనీయాశంగా మారింది.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతల పై పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాశంగా మారాయి.అమరావతి మెదలుగొని, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసే విషయం వరకు కాషాయ దళం తీరు పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టిలో తనను ముందుగా పిలిచింది నరేంద్ర మోడీ అని ఆయన అంటే తనకు గౌరవం ఉందని పవన్ అన్నారు.ఆ తరువాత భారతీయ జనతా పార్టి లోని ఇతర నేతలతో కలసి సమావేశంలో చర్చించుకున్న అంశాలు, రాష్ట్రాని వచ్చే సరికి ఎందుకో అమలు కాలేదని పవన్ వ్యాఖ్యానించారు. అందుకు కారణాలు కూడా బీజేపీ నేతలే చెప్పాల్సి ఉందన్నారు.
అంతే కాదు పొత్తులో ఉన్నామని చెబుతూ.. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం పై పవన్ కౌంటర్లు వేశారు. జాతీయ నాయకత్వంతో చర్చలు తరువాత వాటి కొనసాగింపు చర్యలు ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ వ్యవహరంలో తనకు పూర్తి అవగాహన ఉందని అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఎందుకనో మౌనంగా ఉంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు.దీంతో ఇరు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ అంశం పై ఇప్పటి వరకు ఉన్న రుమార్స్ కాస్త,వాస్తవమే అనే అభిప్రాయం ఇ స్పష్టం అయ్యిందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల తీరు ఇప్పటికి చర్చనీయాశంగా నే ఉంది. సొంత నేతలు విమర్శలు,ఆరోపణలు చేస్తున్నా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వాటిని పట్టించుకోకపోవటం, కనీసం వారిని పిలిచి మాట్లాడకపోవటం,తో చాలా మంది పార్టీని వీడుతున్నారు. పార్టీని వీడుతున్నట్లుగా తెలిసినా కనీసం కన్నా లక్ష్మినారాయణను పార్టీ అగ్రనేతలు పిలిచి మాట్లాడేందుకు కూడా ప్రయత్నించలేదు.ఇ దే పార్టీకి పెద్ద మైనస్ గా చెబుతున్నారు. కన్నా పార్టీలో ఉండగా కూడ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ను భారతీయ జనతా పార్టీ సరిగ్గా వినియోగించుకోవటం లేదని నేరుగా చెప్పారు. అప్పుడు కూడ భారతీయ జనతా పార్టీ నేతలు కనీసం స్పందించలేదు.. ప్పుడు చివరకు పొత్తులో కంటిన్యూ అవుతున్న పవన్ కళ్యాణ్ కూడ బారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నాయకత్వం పై చేసిన కామెంట్స్ కూడ అదే స్దాయిలో ఉన్నాయి.
కేంద్రంలోని నాయకత్వంతో సంప్రదింపులు చేసిన తరువాత ఆంద్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు కలసి పని చేసేందుకు ముందు కు రాకపోవటం వలనే రాష్ట్రంలో తెలుగు దేశం బలపడగలిగిందని పవన్ కళ్యాణ్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు.దీని పై కూ బీజేపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారన్నది వేచి చూడాల్సి ఉంది.
TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?
TDP Vs Janasena: జనసేన - బీజేపీ మధ్య గ్యాప్కు కారణం ఎవరు ? పవన్ పట్టించుకోలేదా ? బీజేపీ నిర్లక్ష్యం చేసిందా ?
Warangal BJP: వరంగల్ పశ్చిమ బీజేపీలో టికెట్ కోసం పోటా పోటీ, నేతల వరుస పర్యటనలు
నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్
TSPSC Paper Leak Case : పేపర్ లీక్ కేసు సీబీఐకి ఇవ్వాలా వద్దా ? హైకోర్టు చెప్పింది ఏమిటంటే ?
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా