Pavan Janavani : ఆదివారం నుంచి పవన్ జనవాణి - విజయవాడ నుంచి ప్రారంభం
ఆదివారం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. అనుమతి కోసం ఆ పార్టీ నేతలు పోలీసులకు దరఖాస్తు సమర్పించారు.
Pavan Janavani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కౌలు రైతుల భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న జనసేన పవన్ ఇప్పుడు ప్రధాన నగరాల పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా నే జనవాణి జనసేన భరోసా పేరుతో మరో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. జూన్ 3వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పవన్ నిర్వహిస్తున్నారు. 3వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటలు నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు బందరు రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధితుల పక్షాల పవన్ కళ్యాణ్ స్వయంగా వినతిపత్రాలు స్వీకరిస్తారని పార్టి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు భద్రత,బందోబస్తుకు సహకరించాలని పార్టీ నాయకులు విజయవాడ పోలీస్ కమీషషనర్ ను కలసి వినతి పత్రం సమర్పించారు.
జనసేన పార్టీకి ఒకే ఒక్కడుగా ఉన్న పవన్ కళ్యాణ్ తన లక్ష్యం కోసం ప్రజల్లో కి వెళ్లేందుకు ప్రణాళికలను సిద్దం చేసుకుంటూ,రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలంటే డబ్బు అనే స్థితికి వెళ్లిపోయిన పరిస్దితుల్లో ,తాను సినామాలు ద్వారా సంపాదించిన దాంతోనే రాజకీయాలకు ఖర్చు చేస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు కు దత్తపుత్రుడు పేరుతో ప్రతిపక్షాలు తీవ్ర స్దాయిలో విమర్శలు చేస్తున్నప్పటికి అదికార పక్షానికి ధీటుగా కౌంటర్ ఇస్తూ పవన్ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో ఉమ్మడి జిల్లాలను చుట్టేస్తున్న పవన్ ఇప్పుడు నగరాల పై దృష్టి సారించారు.
రాజకీయాలకు కేంద్రం అయిన విజయవాడ లో ప్రత్యేక కార్యక్రమానికి పవన్ తెర తీశారు. జనవాణి జనసేన భరోసా ప్రజల్లోకి వెళ్ళేందుకు పవన్ రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు.ఉదయం నుండి మద్యాహ్నం వరకు ఒక చోట పవన్ ప్రజలకు అందుబాటులో ఉంటారు . అక్కడకు వచ్చిన వారితో మాట్లాడి వారి సాదక బాదకాలను వినటంతో పాటుగా వారిలో భరోసా కల్పించటం,అవసరం అయిన వారి సమస్య పై పోరాటం చేసి, అండగా నిలబడి, నమ్మకం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ నిర్వహించాలని భావించారు. అయితే ముందు విజయవాడ,విశాఖ ,తిరుపతి, తో పాటుగా ప్రదాన పట్టణాల్లో పవన్ ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో పార్టీ పరిస్దితులు పై కూడ ఆరా తీస్తారు. దీని వలన అటు పార్టీ తో పాటుగా ప్రజలకు కూడ అందుబాటులో ఉన్నామనే సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. ఆ తరువాత ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో కూడా పవన్ తన సమయాన్ని కేటాయిస్తారు.