అన్వేషించండి

Andhra Pradesh : కూటమి పార్టీల్లో నామినేటెడ్ పోస్టుల పంచాయతీ - పదవుల పంపకం అంత తేలిక కాదా ?

Andhra Politics : టీడీపీ బీజేపీ జనసేన మధ్య నామినేటెడ్ పోస్టుల పంచాయతీ ప్రారంభమయింది. అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో ఎవరికి ఏ పోస్టు అన్నదానిపై చర్చలు తేలడం లేదని తెలుస్తోంది.

Nominated posts War between TDP BJP JanaSena  :  ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు తమ విజయం కోసం కృషి చేసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాయి.  రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టులను క్యాడర్ కు ఇచ్చేయాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి.  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నానినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి  ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.  ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ దాదాపుగా పూర్తి చేశారు. 

టిక్కెట్లు దక్కని నేతలకు ప్రాధాన్యత                   

కూటమలో భాగంగా మూడు పార్టీల్లోని కీలక నేతలు పోటీ చేయలేకపోయారు. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.    ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని.. నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా ప్రయార్టీ లభిస్తుందని జనసేన నేతలు ఆశ పడుతున్నారు.  తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ  అంచనాలో ఉంది.   కూటమి పార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల పంపిణీకి ఫార్ములాను రూపొందించారు.  టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 30 శాతం జనసేన, 10 శాతం బిజెపి కార్యకర్తలకు, బిజెపి ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో టిడిపికి 50 శాతం, బిజెపి, జన సేనలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నరు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న  చోట్ల అరవై శాతం టీడీపీకి , ముఫ్పై శాతం జనసేనకు, పది శాతం బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నారు. 

హరీశ్‌రావు వెనుక తొంగి తొంగి చూస్తున్న రేవంత్, 20 ఏళ్ల నాటి వీడియోతో కౌంటర్

ఆశావహుల్ని సంతృప్తి పరచడం అంత తేలిక కాదు         

 మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేన పార్టీల్లో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు నామినేట్ పోస్టుల కోసం పోటీపడుతున్నారు.  వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులతో పాటు  వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.  2014-19 టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బిజెపికి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. టిడిపిలో నామినేటెడ్‌ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావహులు భారీగానే ఉన్నారు.

ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ చంద్రబాబుదే - మంద కృష్ణ ప్రశంసలు - ఏపీ సీఎం స్పందన ఏమిటంటే

విజయం కోసం పని చేసిన వారికే !         

పార్టీ విజయం కోసం పని చేసిన వారికే మాత్రమే పదవులు ఇస్తారు.  త్యాగం చేసిన మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు కూడా నామినేటెడ్‌ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టిడిపి కార్యాలయంలో ఆశావహులు దరఖాస్తులు ఇచ్చారు.   ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు  ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని  నిర్ణయించారు.  ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్క్రూటినీ చేస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. 

మొత్తంగా కూటమి ప్రభుత్వంలో  నామినేటెడ్ పదవుల పంపకం అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వివాదం రాకుండా చూసుకోవాలని మూడు పార్టీల నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Embed widget