అన్వేషించండి

MIM On Raja singh : రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలి - ఎంఐఎం డిమాండ్ !

రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరించాలని ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారు.


MIM On Raja singh :   గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని మజ్లిస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంఐఎం జనరల్ సెక్రటరీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలుచేసినందున ఆయనపై తక్షణం బహిష్కరణ వేటు వేయాలని లేఖలో సయ్యద్ ఖాద్రి స్పీకర్‌ను కోరారు. ఏ ఏ సెక్షన్ల కింద రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవచ్చో కూడా ఖాద్రి తన లేఖలో వివరించారు. 

రాజాసింగ్ ..ఓ వర్గం వారిని కించ పరిచేలా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఇప్పటికీ సీరియస్ అయింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకు శాశ్వతంగా బహిష్కరించకకూడదో చెబుతూ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆయనపై పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరించాలని మజ్లిస్ డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయనను అసెంబ్లీకి రాకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో అశాంతికి ఆజ్యం పోశాయి.  మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాయంత్రం రాజాసింగ్‌ను కోర్టులో హాజరుపరిచిన అనంతరం ముందుగా రిమాండ్‌ విధించినప్పటికీ.. తరువాత బెయిల్‌ పిటిషన్‌ వేయడంతో వాదనల అనంతరం న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చింది.కోర్టు 41ఏ సీఆర్పీసీ ప్రకారం ఏడేండ్ల లోపు శిక్షలు పడే నేరాల్లో అరెస్ట్‌ చేసే ముందు నిందితుడికి నోటీసు ఇవ్వాలని తెలిపింది. రాజాసింగ్‌ కేసు విషయంలో ఇలా జరగలేదు కాబట్టి అతని అరెస్ట్‌ 41ఏ సీఆర్పీసీ కి విరుద్ధమని పేర్కొన్నది. రాజాసింగ్‌ రిమాండ్‌ను రిజెక్ట్‌ చేసి వెంటనే విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. రాజాసింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా మరో 12 కేసులు నమోదయ్యాయి.

రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివాదాస్పద వీడియోను వెంటనే యూట్యూబ్‌ నుంచి తొలగింపజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల పోలీస్‌ ఫోర్స్‌ సిబ్బంది రాత్రికి రాత్రే విధులకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కూడా మూడు జోన్ల పరిధిలో పలు చోట్ల దుకాణాలు మూసేసి రాజాసింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలువురు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చివరికి ఆయనను పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. ఇక అసెంబ్లీ నుంచి పంపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
Karnataka Political Sting Operation 2026: కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
AIMIM AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?
ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget