అన్వేషించండి

KTR: '4 నెలల్లోనే ఈ దుస్థితి ఊహించలేదు' - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రటి ఎండల్లో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

KTR Comments on CM Revanth Reddy:  తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఈ దుస్థితి ఊహించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సిరిసిల్ల (Siricilla) పట్టణంలోని తెలంగాణ భవన్ లో రైతు దీక్షలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లోకి తిరిగితే.. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ఆవేదన చెందుతున్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని అడిగితే ఎన్నికల కోడ్ ఉందని అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలి. మేము కూడా ఉత్తరం రాస్తాం. కరువు వస్తే మమ్మల్ని తిడుతారా.? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. మేడిగడ్డలో పిల్లర్లు కుంగితే రిపేర్ చేయకుండా కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

'రైతుబంధు డబ్బులు ఎక్కడ.?'

'అప్పుడు వర్షాలు పడి పంటలు మునిగిపోయాయని మంత్రి శ్రీధర్ బాబు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వర్షాలు పడలేదని అంటున్నారు. ఎన్నికల ముందు రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు సిద్ధంగా పెట్టాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ డబ్బులు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఆపింది. ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు.' అంటూ మండిపడ్డారు.

'ఆ హామీలు నెరవేర్చాలి'

'డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు. ఎన్నికల్లో ఓడిపోయామని రైతుల తరఫున కొట్లాడకుండా ఆగుతామా?. వారికి అండగా నిలబడేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలి. రైతు భరోసా, రూ.4 వేల పెన్షన్, రూ.2 లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్లు కాంగ్రెస్ కు ఓటెయ్యండి. రాని వాళ్లు మాకు ఓటెయ్యండి. హామీలను నెరవేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న భయం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కొరత ఉంది. మిషన్  భగీరథ నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. హామీలపై సర్కారును నిలదీద్దాం. 420 కాంగ్రెస్ హామీలను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.  30 వేల ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. మీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. నేతన్నల కోసం టీఆర్ఎస్ పార్టీ దీక్షలు చేస్తోంది. ప్రభుత్వం నేతన్నలను ఆదుకునే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: Harish Rao: 'కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే వారికి నిద్ర పట్టడం లేదు' - మంత్రుల వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget