అన్వేషించండి

KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం .. "ఇండియా రియాక్ట్స్" నినాదం ! ఢిల్లీ వైపు కేసీఆర్ లాంగ్ జంప్ ట్రై చేశారా ?

జాతీయ రాజకీయాలపై తనకు ఎన్నో ఆశలు ఉన్నాయని కేసీఆర్ తన ప్రెస్‌మీట్ ద్వారా చెప్పకనే చెప్పారు. తనకు ఎంతో విజన్ ఉందని..గొప్ప నాయకత్వం అందిస్తానని తన మాటలతో వెల్లడించారు. మరి "ఇండియా రియాక్ట్" అవుతుందా ?

 

" కొత్త రాజ్యాంగం కావాలి " ఈ మాట ఓ రాజకీయనాయకుడు అంటే ఎంత గగ్గోలు రేగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదీ ముఖ్యమంత్రి అంటే ..? రియాక్షన్ అంచనా వేయలేం. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఇంత కాలం విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కాదు.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే విధానం తీసుకున్న కేసీఆర్ ఈ " రాజ్యాంగ మార్పు" వాదన తీసుకొచ్చారు. ఇదొక్కటే కాదు బడ్జెట్‌పై స్పందన కోసం ఆయన పెట్టిన రెండున్నర గంటల త్రిభాషా ప్రెస్‌మీట్‌లో దేశం మొత్తం ఆలకించాల్సిన ఎన్నో విషయాలు చెప్పారు. ఓ సందేశం పంపారు. తన సంకల్పం ఆవిష్కరించారు. అయితే  ప్రతీ చోటా తన రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. అంతా దేశం కోసమేనని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.
KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం ..

దేశానికి సరైన నాయకత్వం ఇస్తామని పరోక్ష సంకేతాలు !
 
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఫీడ్ బ్యాక్ ఏమంత బాగోలేదు. బీజేపీతో  కేసీఆర్ సంబంధాలు అస్సలు బాగోలేవు. ఇంత కంటే మంచి సందర్భం ఓ రాజకీయ నాయకుడికి.. అదీ జగమెరిగిన రాజకీయనాయకుడికి ఏముంటుంది..?. ఆ విషయం లో కేసీఆర్ వంద శాతం సక్సెస్ అయ్యారు. మీడియా ముందుకు వచ్చి రెండున్నర గంటల పాటు.. తెలుగు, ఇంగ్లిషు .. హిందీల్లో తనదైన శైలిలో ఓ భావావేశాన్ని ప్రజల్లోకి పంపించారు. అది తెలంగాణ ప్రజల్లోకి కాదు.. దేశ ప్రజలందరిలోకి. ఈ ప్రెస్‌మీట్‌లో కేవలం కేంద్రాన్ని విమర్శించడం మాత్రమే లేదు.. అంతకు మించి ఉంది..!  ఇందులో దాపరికాలు ఏమీ లేవు. బీజేపీని ఏకిపారేసే క్రమంలో తన ఆశయాలు .. జాతీయ రాజకీయాలపై ఆశలను కూడా  కేసీఆర్ బయటపెట్టారు. అవును.. దేశానికి సరైన నాయకత్వం తాము ఇస్తామని.. నేరుగా సందేశం కూడా ఇచ్చారు. ఆయన చాలా కాలంగా ఇలాంటి అవకాశం కోసం చూస్తున్నారు. దేశాన్ని బీజేపీ భ్రష్టుపట్టించిందని చెప్పడంతో ఆగలేదు ఆయన..! దేశానికి ఏం కావాలో మాకు తెలుసన్నారు. ఇండియా రియాక్ట్స్ అనే అనే స్లోగన్ ఇచ్చారు..  అంటే.. భారత్‌ ఈ పరిస్థితికి రియాక్ట్ అవుతుందని ఆయన అన్నారు. మరి ఆయన ప్రెస్‌మీట్ సాగినంత పవర్‌ఫుల్‌గా రియాక్షన్ వస్తుందో లేదో చూడాలి..
KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం ..

బడ్జెట్ కన్నా తమ పరిపాలన గొప్పగా ఉందని ఉదాహరణలతో వివరించిన కేసీఆర్ ! 

నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను గోల్‌మాల్ గోవిందం అని తేల్చేశారు కేసీఆర్. దేశ బడ్జెట్‌లో ఎస్సీ , ఎస్టీలకు పెట్టిన బడ్జెట్‌ కంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో వాళ్లకోసం కేటాయిస్తున్న బడ్జెట్‌ మూడురెట్లు ఎక్కువ అని లెక్కలు చెప్పారు. ఎరువుల సబ్సిడీ 12వేల కోట్లు ఉపాధి హామీ పథకంలో 25వేల కోట్లు కోత పెట్టారన్నారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన కేసీఆర్ వ్యూహాత్మకంగా తీసుకు వచ్చారు. ఈ దేశంలో అధిక జనాభా ఉన్న దళితులు, గిరిజనులు, రైతులు అనే కీలక వర్గాలను కేసీఆర్‌ టచ్‌ చేశారు. వాళ్లకు అన్యాయం జరుగుతోంది అని గొంతెత్తారు. ఇక కేసీఆర్‌ తన ప్రసంగానికి హ్యూమన్ టచ్ కూడా ఇచ్చారు.. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో కనీసం...  పేదలకు రైల్‌ టికెట్లు కూడా ఇవ్వని ప్రభుత్వం ఇది ఆక్రోశం వ్యక్తం చేశారు. వేలాది మంది రోడ్లమీద ఆకలితో చనిపోయారు... అని చెబుతూ.. తమ రక్తం మరిగిపోతుందని.. అన్నారు. కరోనా దేశాన్ని సర్వనాశనం చేస్తే.. వైద్య బడ్జెట్‌ మాత్రం ఒక్క రూపాయి పెరగలేదు అన్నారు. ఇంపార్టెంట్ విషయమే ఇది. అలాగే విద్యుత్‌ సంస్కరణల పేరుతో జరుగుతోంది కూడా మోసం అన్నారు. ఎందుకంటే.. ఇందులో ఎక్కువుగా ఇబ్బంది పడేది తెలంగాణనే... వీళ్లు చేసేదేమీ లేదు. మీటర్లు పెట్టి రైతులను దోచుకోవడమే..అని తెగ్గొట్టేశారు.
KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం ..

గుజరాత్ మోడల్.. బీజేపీ రాజకీయాలపై సెటైర్లు !

ప్రధానమంత్రి స్థాయిని తగ్గించడం కోసం.. ఆయనదంతా.. ఫాల్స్ ఇమేజ్‌  అని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే.. గుజరాత్‌ మోడల్‌తో దేశాన్ని ముంచారు అని పస్తావించారు. ఊపర్‌ షేరవానీ.. అందర్ పరేషానీ అనేది గుజరాత్‌ మోడల్ పైన పటారం లోన లొటారం అని వెక్కిరించింది కూడా అందుకే.. !  ఇక బీజేపీ పాలన అంటే... అని కేసీఆర్ తన స్టైల్‌లో మూడు నాలుగు వాక్యాల్లో చెప్పేశారు.  బీజేపీ పరిపాలన అంటే  దేశాన్ని అమ్ముడు.. మతపిచ్చి లేపుడు...  రాజకీయపబ్బం గడుపుకొనుడు.. ఇతర పార్టీలపై ఏడువుడు.. ఇంతే అంటూ.. మొత్తం విషయాన్ని సూక్ష్మంగా .. ఈజీగా అర్థం అయ్యేలా చెప్పారు. ఉదాహరణలు కూడా చెప్పారు. ఎయిర్‌ ఇండియాను అమ్మడం.. ఎల్‌ఐసీ ఐపీవో..ఇలా అన్ని విషయాలను ప్రజలకు వివరించారు.
KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం ..

మోడీ ఫెయిలయ్యారని ఉదాహరణతో సహా వివరణ !

బీజేపీ ప్రధాని మోడీ ఇమేజ్ మీదే ఎక్కువ ఆధారపడుతోంది. అందుకే కేసీఆర్ వ్యూహాత‌్మకంగా మోడీ పనితీరుపైనే గురి పెట్టారు. మోడీ ఫెయిలయ్యారని ఉదాహరణలతో వివరించారు. బీజేపీ ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చిందో.. వాటిలో ఎంత దారుణంగా విఫలం అయిందో చెప్పే ప్రయత్నం చేశారు. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామన్నారు.. అయిందా.? హౌసింగ్ ఫర్‌ ఆల్ అన్నారు.. అయిందా..? బ్లాక్‌మనీ తెస్తామన్నారు.. తెచ్చారా..? బ్లాక్‌మనీ తెస్తామని చెప్పి.. బ్లాక్‌మనీ సంపాదించినోళ్లని దేశం దాటించారని విజయ్‌మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్లను చూపించి బీజేపీపై ఎటాక్ చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రికి సరైన విజన్ లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రికి విజన్ లేదు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కురచబుద్ధి ప్రదర్శిస్తున్నారని.. గుజరాత్‌కే ప్రధాని చెప్పే ప్రయత్నం చేశారు. మోదీ మీద ఈ విమర్శ చాలా సందర్భాల్లో ఉంది. మోదీతో విబేధించాక చంద్రబాబునాయుడు, మమత బెనర్జీ, స్టాలిన్‌ వంటి వాళ్లు కూడా ఇలాంటి మాటలే అన్నారు. దానికి మరింత ఫ్యూయల్ యాడ్ చేశారు.. కేసీఆర్. ఈ సందర్భంగా అంతర్జాతీయ అర్బిట్రేషన్ సెంటర్‌ను మోడీ గిఫ్ట్ సిటీకి తీసుకెళ్లాలని అనుకున్నారని ఆరోపించారు.
KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం ..

హిందూయిజాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం !

బీజేపీ బలం అయిన హిందూయిజాన్ని కేసీఆర్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. దానికి ప్రారంభోత్సవానికి సిద్ధమైన రామానుజుల విగ్రహాన్ని ఉపయోగిచుకున్నారు. రామానుజ విగ్రహం పెట్టింది తామేనని చెప్పి క్రెడిట్ సొంతం చేసుకున్నారు. అలాగే దానిపై బీజేపీ సోషల్‌మీడియా ఉత్తరాదిలో ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. జాతీయ పార్టీలు  రెండు పార్టీలు దేశానికి  చేయాల్సినంత చేయలేదనడం ద్వారా తాము నాయకత్వం ఇస్తామని చెప్పే ప్రయత్నాన్ని సూటిగానే చేశారు.  దేశ సమస్యలను ప్రస్తావించడం .. అఖిల భారత రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులతో సమావేశం అవుతున్నాం అని చెప్పడం ద్వారా దేశ సమస్యలపై తనకు కన్సర్న్ ఉందని చెప్పడం .. హిందీ, ఇంగ్లిష్‌లో  మట్లాడటం... ద్వారా దేశం మొత్తం తెలిసేలా చేయడం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులే. మా దగ్గర గుడుంబా కంపు లే  పేకాట క్లబ్బు లేదు అని తనకు దూరం జరిగి.. బీజేపీకి దగ్గరగా ఉన్న ఏపీ అధికార పార్టీకి కౌంటర్‌ వేశారు. స్క్వేర్ ఫీట్‌కు ఇంత అని వసూలు చేస్తున్నారని ఆరోపించారు.  
KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం ..

రాజ్యాంగం మార్చాలనే చర్చ ప్రారంభించిన కేసీఆర్ ! 
 
తెలంగాణలో దళితులకు.. కేంద్రం కంటే మూడురెట్లు ఎక్కువ  ఇస్తున్నాం అంటున్నారు. కేంద్రం తెలంగాణకు ఇన్నాళ్లుగా ఇచ్చిన డబ్బుకంటే  ఒక్క రైతుబంధు కింద తాము పెట్టిన ఖర్చు ఎక్కువ అని చెప్పడం ద్వారా తెలంగాణ ఒక రోల్ మోడల్ అనిచెప్పే ప్రయత్నం చేశారు. దేశంలో 24గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు. అంటే.. ఒక కేంద్రం అన్ని రంగాల్లో విఫలం అయిందని చెప్పడంతో పాటు.. తాను ఆదర్శవంతమైన పాలన ఇచ్చానని చెప్పుకున్నారు. దేశంలోని నీటి వనరులను సరిగ్గా వాడుకోలేకపోయారరని.. నదుల అనుసంధానం పనికిరాని ఆలోచన అని చెప్పడం ద్వారా.. జాతీయ సమస్యలపై తనకు అవగాహన ఉందని ప్రజలకు తన మాటలతో వివరించారు.  అదే సందర్భంలో రాజ్యాంగ మార్చాలి అని కొత్త చర్చను కేసీఆర్ తీసుకొచ్చారు. దీనిపై డిబేట్ జరగాలి అంటున్నారు. దీని గురించి పదే పదే చెప్పి... మీడియాకు అది రాయాలి అని కూడా అన్నారు. అంటే.. ఆ మార్పు రావాలి.. ఆ మార్పు తనవైపు చూడాలి అని ఆయన కోరుకుంటున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నేరుగా చెప్పలేదు.. దేశం కోసమే ఆరాటమని సంకేతాలు !
 
ఇన్ని చెప్పిన కేసీఆర్  ఒక ఆప్షన్ ఉంచుకున్నారు. నేరుగా తన ఆకాంక్షలను బయట పెట్టుకోలేదు. దేశంలో జరిగే పరివర్తన కార్యక్రమంలో తాను కీలక భాగస్వామ్యం వహిస్తాన్నారు. అది ప్రధాని పదవా లేక పోతే ఇంకోటా అన్న విషయం ఆయన స్పష్టంగా చెప్పలేదు. అలా అని ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదూ అని చెప్పలేదు. ఇంటర్నల్‌గా తాను ఆల్టర్నేట్ అని ని చెప్పడానికి ప్రయత్నించారు. అలాగే...   ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. సెమీఫైనల్‌ కాదు అని చెప్పారు. ఇప్పుటికీ యూపీలో బీజేపీనే స్టాంగ్ గా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఆయన బీజేపీకి సీట్లు తగ్గుతాయి అని చెప్పారు కానీ.. ఓడిపోతుంది అని కమిట్ అవ్వలేదు. కానీ బీజేపీ పతనం అక్కడ నుంచే అన్నారు. ముందు కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కోసం ప్రయత్నాలు చేసినా అవి అంతగా ఫ్రూట్‌పుల్ అవ్వలేదు. ఎలక్షన్ కు ముందు ఇది జరిగింది. ఆ తర్వాత ఆయన కొన్నాళ్లు కేంద్రంతో క్లోజ్ గానే ఉన్నారు. ఈ మధ్యనే తేడా వచ్చింది.  లేకపోతే.. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాం... కాబట్టి కేంద్ర రాజకీయాలకు వెళ్లాలన్న ఆలోచన మెలిసింది. అందుకే ఈ సంగతులన్నీ.. స్టాలిన్‌తో కలిసింది అందుకే అన్న ఆయన..  త్వరలోనే ఉద్ధవ్‌ టాక్రేను కూడా కలుస్తా అన్నారు. అంతేకాదు.. మళ్లీ ఢిల్లీ వెళతా అన్నారు.  సో.. లైన్ క్లియర్‌గానే కనబడుతోంది. ఆయన ఇప్పుడు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఏడేనిమిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు.. ఆయన పెద్ద టార్గెట్‌పై కాన్సట్రేట్ చేశారు.  ఇప్పుడు ఏం చేసినా .. అది బోనస్సే..
KCR : కొత్త రాజ్యాంగం టు సరికొత్త నాయకత్వం ..

కొసమెరుపు ఏంటంటే.. ? 
నాలుగైదు రోజుల్లో ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చే షెడ్యూల్ ఉంది. రామానుజుల విగ్రహం ప్రారంభోత్సవానికి వస్తున్నారు. మరి బడ్జెట్‌ కారణం చూపి తీవ్రంగా విమర్శించిన తర్వతా ఎలా ఫేస్ చేస్తారు అన్న ప్రశ్న వచ్చింది. దానికి కేసీఆర్ తన స్టైల్‌ లో సమాధానం చెప్పారు. అది అదే.. ఇది ఇదే.. అని.. మోదీతో హెలికాఫ్టర్‌లో వెళ్లేప్పుడు కూడా ఇవన్నీ చెప్తా అన్నారు. అంటే .. రాజకీయం రాజకీయమే ... ఇది కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య . 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget