అన్వేషించండి

Telangana Rakshana Sena ECI Rejection: కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?

Telangana Jagruthi As Political Party: తెలంగాణ రక్షణ సేన పేరు ఈసీ ఆమోదం రాలేదు. న్యాయపోరాటం చేస్తానని కవిత అంటున్నారు. కానీ జాగృతి ని పార్టీగా ప్రకటిస్తే మంచిదన్న సలహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telangana Politics Kavitha New Party Strategy:   భారత రాష్ట్ర సమితి   నుండి బయటకు వచ్చి, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని సృష్టించుకోవాలని భావించిన కల్వకుంట్ల కవితకు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాత ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్‌ను, గులాబీ కేడర్‌ను ఆకట్టుకోవడానికి వీలుగా ఆమె  తెలంగాణ రక్షణ సేన TRS అనే పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించారు.  TRS అనే మూడు అక్షరాలతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ను రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనేది ఆమె ప్లాన్. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ పేరు రిజిస్ట్రేషన్‌కు రాగానే కథ అడ్డం తిరిగింది. ఈ పేరుపై బీఆర్ఎస్ శ్రేణుల నుండి, ఇతర వర్గాల నుండి రికార్డు స్థాయిలో భారీగా అభ్యంతరాలు రావడంతో ఈసీ దీనిని తిరస్కరించింది. రాబోయే 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితకు అల్టిమేటం జారీ చేసింది.

న్యాయపోరాటానికే కవిత మొగ్గు 

  కవిత మాత్రం వెనక్కి తగ్గకుండా ఈసీ నిర్ణయంపై న్యాయపోరాటం  చేస్తానని ప్రకటిస్తున్నారు. అయితే, కవిత ఇలా పార్టీ పేరు చుట్టూ వివాదాలు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగితే అది క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. ఒక కొత్త పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించేటప్పుడు కేడర్‌లో, ఓటర్లలో స్పష్టత ఉండాలి. కానీ, ఇప్పటికే ఒకటికి రెండుసార్లు పార్టీ పేరు మార్పులు, లీగల్ నోటీసుల వ్యవహారాలతో ప్రజల్లోకి నెగెటివ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. చివరకు నెలల తరబడి కోర్టుల్లో పోరాడినా ఈసీ పరిధిలోని సాంకేతిక అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి.. చివరి నిమిషంలో పేరు మార్చుకోవాల్సి వస్తే పార్టీలో తీవ్ర కన్ఫ్యూజన్ ఏర్పడటం ఖాయం. 

 జాగృతి పేరుపైనే అంచనాలు 

నిజానికి కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నప్పుడు.. ఆమె దశాబ్ద కాలంగా నడుపుతున్న తెలంగాణ  జాగృతి పేరునే పొలిటికల్ పార్టీగా మారుస్తారని రాజకీయ వర్గాలన్నీ బలంగా నమ్మాయి. కానీ ఆమె అనూహ్యంగా టీఆర్ఎస్ పేరును ఎంచుకుని చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ సమాజంలో కవిత పేరు వినబడగానే అందరికీ మొదట గుర్తొచ్చేది తెలంగాణ జాగృతి  మాత్రమే. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా, బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడం ద్వారా కవిత మహిళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో  జాగృతి బ్రాండ్‌ను విపరీతంగా ప్రమోట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థకు ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ బలమైన నెట్‌వర్క్, నిబద్ధత కలిగిన కేడర్ ఉన్నారు.  తెలంగాణ రక్షణ  సేన అనే ఒక కొత్త పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దానికి గుర్తింపు తేవడానికి పడే శ్రమ కంటే.. ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న  తెలంగాణ జాగృతి లేదా   తెలంగాణ ప్రజా జాగృతి అని  పార్టీగా మారిస్తే ప్రజల్లోకి దూసుకెళ్లడం అత్యంత సులువవుతుంది.

పేరు గందరగోళం త్వరగా తేల్చుసుకోవాలి! 

అందుకే ప్రస్తుతం కవిత చుట్టూ ఉన్న ముఖ్య అనుచరులు, రాజకీయ శ్రేయోభిలాషులు ఆమెకు ఒక కీలకమైన సలహా ఇస్తున్నారు. లేనిపోని ప్రతిష్టకు పోయి TRS అనే మూడు అక్షరాల కోసం ఈసీతో, కోర్టులతో కాలయాపన చేయడం కంటే.. ఈ గందరగోళానికి తక్షణమే తెరదించి  జాగృతి నే అధికారిక రాజకీయ పార్టీ పేరుగా ప్రకటించుకోవాలని కోరుతున్నారు.   చట్టపరమైన చిక్కుల్లో సమయాన్ని వృథా చేసుకోవడం కంటే, క్లీన్ రోడ్‌గా ఉన్న  తెలంగాణ జాగృతి ' అస్త్రాన్ని ప్రయోగించడమే కవిత పొలిటికల్ కెరీర్‌కు సేఫ్ అండ్ బెస్ట్ రూట్ అని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కవిత ఏ నిర్ణయం తీసుకుంటారో?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget