YSRCP Permanent President : వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?
వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కానున్నారు. ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
YSRCP Permanent President : వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ నియామవళిలో కీలక మార్పులు చేయబోతున్నారు. వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్‌ను ఎన్నుకోనున్నారు. అంటే పార్టీ ఉన్నంత కాలం ఆయనను అధ్యక్షుడిగా ఎవరూ తొలగించలేరన్నమాట. మామూలుగా అయితే నియామవళి ప్రకారం సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల కమిషన్‌కు ఆ వివరాలు సమర్పించాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికవనుండటంతో ఇక ముందు సంస్థాగత ఎన్నికల అవసరం ఉండదని భావిస్తున్నారు.
35 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, మళ్లీ నల్లారి ఇంటికి!
శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకునేలా పార్టీ నియామళి మార్పు
సాధారణంగా ఇక కింది స్థాయి నాయకత్వాన్ని అంటే జిల్లా అధ్యక్షులు..కార్యదర్శలు.. ఇతర పదవుల్ని పార్టీ అధనేతనే భర్తీ చేస్తారు కాబట్టి సంస్థాగత ఎన్నికలు కూడా ఉండవన్నమాట. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు ఇలా శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకోవడం సాధ్యమేనా లేదా అన్నది ఈసీ స్పష్టత నివ్వాల్సి ఉంది. అయితే ఇంత హఠాత్తుగా శాశ్వత అధ్యక్షుడ్ని నియమించేలా వైఎస్ఆర్‌సీపీ నియమావళిని ఎందుకు మార్చాల్సి వస్తుందన్నదానిపై ఆ పార్టీ వర్గాలు నోరు మెదపడం లేదు.
మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?
మహారాష్ట్ర తరహా పరిణామాలు చోటు చేసుకున్నా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారా ?
పార్టీపై సీఎం జగన్‌కు తిరుగులేని పట్టు ఉంది. అయితే రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమని మహారాష్ట్ర పరిణామాలు నిరూపిస్తున్నాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు. శివసేన పార్టీ తరహా పరిణామాలు ఎదురైతే ఎదుర్కోవడానికి ఈ మార్పు సహకరిస్తుందన్న వాదన కొంత మందిలో వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ అధ్యక్షుడిగా .. గౌరవాధ్యక్షురాలిగా విజయలక్ష్మి ఉన్నారు.
రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
పార్టీ నియామవలి మార్పు తర్వాత గౌరవాధ్యక్షురాలి పదవి ఉంటుందా ?
ఇటీవలి రాజకీయ పరిణామాలతో ఆమె గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతారో లేదో స్పష్టత లేదు. పార్టీ నియమావళి మార్చిన తర్వాత గౌరవాధ్యక్ష పదవి కూడా ఉండకపోచవచ్ని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైతే శాశ్వత అధ్యక్షునిగా సీఎం జగన్ ఉండేలా నియామవళి మార్చబోతున్నారు. ఇతర ఏ నియమాలు మారుతాయన్నది శుక్రవారం తెలిసే అవకాశం ఉంది. k ప్లీనరీలో కీలక నిర్ణయాలు. తీసుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజు పాటు ప్లీనరీ జరగనుంది.