By: ABP Desam | Updated at : 08 Jun 2023 08:00 AM (IST)
మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?
Mini Jamili Elections : జమిలీ ఎన్నికలు అనేది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఓ టార్గెట్ . వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే పద్దతికి ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతుంది. జమిలీ కోసం లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే నిర్వహించాడనికి తాము సిద్ధమేనని ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాకపోయినా సగం రాష్ట్రాలకు పార్లమెంట్ తో పాటే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆరు నెలల వ్యవధిలో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యుల్ ప్రకారం డిసెంబర్‌లోపు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే లోక్ సభ ఎన్నికలతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. అంటే ఆరు నెలల్లోనే పార్లమెంట్ తో పాటు తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అందులో ఐదు రాష్ట్రాలకు ముందుగా జరుగుతాయి. అయితే ఇప్పుడు ఇలా ఎందుకు అన్నింటినీ ఒకే సారి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు తేడాగా ఉన్నాయి. ఆ రాష్ట్రం ఎన్నికలు కూడా ఒకే సారి పెట్టేస్తే పనైపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
పది రాష్ట్రాలు.. లోక్ సభకు ఒకే సారి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా ?
లోక్‌సభతో పాటు మొత్తం 10 రాష్ట్రాల ఎన్నికలను మినీ జమిలీ తరహాలో జరపాలన్న ఆలోచనలో ఉందని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహారాష్ట అసెంబ్లీని రద్దు చేసే యోచనలో బీజేపీ ఉందని ముంబై వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇలా కేంద్రం అనుకుంటే అలా ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం.. బిల్లు ప్రవేశపెట్టబోతోందని ఢిల్లీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లు పాస్ అయితే ‘మిని జమిలి ఎన్నికలు’ జరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చును అరికట్టే ఉద్దేశంతో జమిలి ఎన్నికలు జరపబోతున్నామని ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ గడువును పెంచే అధికారం తమకు ఉందని కేంద్రం వాదించే అవకాశం ఉంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ గడువు పొడిగించాల్సి ఉంటుంది !
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీల గడువు పొడిగించాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం అయితే అసెంబ్లీల గడువు ముగియడానికి ఆరు నెలల ముందే ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ లేటుగా నిర్వహించడానికి అవకాశం లేదు. ఐదేళ్ల గడువు పూర్తయితే ఆ ప్రభుత్వానికి కాలం తీరిపోయినట్లే. అయితే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. అసెంబ్లీ గడువు పొడిగింపు సాధ్యమా కాదా అన్నది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సి ఉంది. మినీ జమిలీపై స్పష్టత లేనప్పటికీ.. విస్తృతంగా ప్రచారం జరుగుతున్న కేంద్రం వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఎక్కువ మంది నిజమేనని నమ్ముతున్నారు.
Minister RK Roja: పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్‌పై మంత్రి రోజా సెటైర్లు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
Sharad Pawar: అనూహ్య పరిణామం- శరద్ పవార్ తో అదానీ భేటీ, ఫ్యాక్టరీ సైతం ప్రారంభం
Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
/body>