HYDRA : హైడ్రా కూల్చివేతల్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ - మంచి వ్యూహమేనా ?
BRS : హైడ్రా కూల్చివేతల్ని బీఆర్ఎస్ వ్యతిరేకించడం మంచి వ్యూహమేనా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తూండటమే దీనికి కారణం.
Strategy for BRS to oppose the demolition of HYDRA : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కూల్చివేతల అంశం హైలెట్ అవుతోంది. హైడ్రా పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిన రేవంత్ రె్డి చెరువుల ఆక్రమణ దారులకు ట్రయిలర్ చూపిస్తున్నారు. అక్రమాలపై పోరాటంలో రేవంత్ రెడ్డి తెగువ చూపిస్తున్నారని ఆయనకు అండగా ఉండాలన్న అభిప్రాయం ప్రజలకు వచ్చేలా చేసుకోగలిగారు. దీంతో హైడ్రా కూల్చివేతలకు ప్రజల మద్దతు లభిస్తోంది. వీలైనంత వరకూ ప్రజలకు ఇబ్బంది కగలకుండా.. పెద్దల ఆక్రమణలను కూల్చేస్తున్నారు. కొత్తగా ఆక్రమణలు జరగకుండా భయం కల్పిస్తున్నారు.
ఇతర పార్టీలన్నీ హర్షం.. ఒక్క బీఆర్ఎస్ తప్ప
హైడ్రా కూల్చివేతలపై ఇతర పార్టీలు వ్యతిరేకించడం లేదు. జనాల నుంచి సానుకూలత వస్తూండటమే దీనికి కారణం. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కూల్చివేతల్ని వ్యతిరేకిస్తోంది. బుల్డోజర్ రాజ్ వద్దని కేటీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేయడానికే హైడ్రా తెచ్చారని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. హరీష్ రావు మరింత దూకుడుగా కూల్చివేతల్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే పేదల ఇళ్లు తొలగిస్తున్నారని అంటున్నారు. బీజేపీ కూడా కూల్చివేతల్ని సమర్థిస్తోంది. వారు పాతబస్తీలో ఓవైసీ ఆక్రమణల్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అవి కాలేజీలు కావడంతో విద్యార్థుల చదువుల దృష్ట్యా కొంత సమయం ఇస్తామని హైడ్రా ప్రకటించింది. అంటే.. బీఆర్ఎస్ మాత్రమే నికరంగా కూల్చివేతల్ని వ్యతిరేకిస్తోంది.
ఇమేజ్ పెంచుకుంటున్న రేవంత్ - ఇతర కాంగ్రెస్ సీనియర్లకు నచ్చడం లేదా ?
చెరువుల్లో కబ్జా చేయగలిగేది పలుకుబడి ఉన్న బడాబాబులే
చెరువుల్లో కబ్జాలు చేయగలిగేది పలుకుబడి ఉన్న బడాబాబులేనని అందరికీ తెలుసు. సామాన్యులు అయితే చెరువుల్లో చెత్త వేయడానికి కూడా భయపడతారు. ఇక కబ్జాలు చేసేంత సీన్ ఉండదు. చెరువుల్లో ఇల్లు కొనుక్కున్న సామాన్యులు ఉంటారు. వారికి అమ్మేది కబ్జా చేసిన బడాబాబులే. ఎలా చూసినా.. డబ్బు అధికారం ఉన్న బడాబాబులే కబ్జా లు చేస్తారు కానీ.. సామాన్యులు కాదు. ఈ విషయంలో వేరే అభిప్రాయాలు ఉండవు. ఇప్పుడు కూల్చివేతలు కూడా బడా బాబులవే. అయితే గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. నాలాలు.. చెరువులు సహా అన్నీ కబ్జాకు గురి కావడంతో హైదరాబాద్ లో వర్షం పడితే నళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నాలుగేళ్ల కిందట ఓ సారి వరదల్లో వంద మందికిపైగా కొట్టుకుపోయారంటే.. హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి మారాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలపై టీడీపీ పక్కా వ్యూహం - రాజీనామాలు చేసినా పదవులు వాళ్లకే !
బీఆర్ఎస్‌కు మైనస్సే
కూల్చివేతల్ని వ్యతిరేకించి రాజకీయం చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను సమర్థించే పరిస్థితుల్లో బీార్ఎస్ లేదు. అందుకే ఏం జరిగినా రాజకీయంగా నష్టం జరిగినా కూల్చివేతల్ని వ్యతిరేకించాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు పరిమితంగానే వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు విస్తృతమయ్యే కొద్దీ.. వ్యతిరేకతను పెంచాలని అనుకంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ెస్ కూల్చివేతలకు వ్యతిరేకమని అనుకోవచ్చు.