అన్వేషించండి

Modi Vs Kejriwal : ఢిల్లీ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ ! వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రచారాస్త్రమా ?

గుజరాత్ మోడల్ ప్రచారంతో దేశం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న మోడీకి అదే పద్దతిలో కౌంటర్ ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమయింది. ఢిల్లీ మోడల్ పేరుతో ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. దానికి తాజా ఎన్నికల ఫలితాలు ఊతం ఇస్తున్నాయి.

 

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెరుగైన స్థానం సాధించినప్పటికీ...అందరి దృష్టి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైనే పడింది.దీనికి కారణం పంజాబ్ ఎన్నికల్లో విజయమే కాదు..మిగిలన రాష్ట్రాల్లోనూ ఆయన పార్టీ గణనీయమైన ప్రగతిని చూపించింది. నరేంద్రమోదీకి సరైన ప్రత్యామ్నాయం లేకనే ఆయన విజయాలు సాధిస్తున్నారని.. ఆయనకు ప్రత్యామ్నాయం దొరికినప్పుడు ఆయనను ప్రజలు వదిలించుకుంటారనే ప్రచారం విపక్షాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఓ రకంగా కేజ్రీవాల్ ఆయనకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చారని అనుకోవచ్చు.

" ఢిల్లీ మోడల్‌ " కేజ్రీవాల్ బ్రాండ్ !
  
అయిదేళ్లలో ఢిల్లీలో తాను చేపట్టిన అభివృద్ధిని దేశ ప్రజల ముందుపెట్టి ఢిల్లీ మోడల్‌గా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలుసు. నెలకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు, మహిళలు, విద్యార్థులకి బస్సుల్లో ఉచిత ప్రయాణం, సీనియర్‌ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రలు , ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంచడానికి గత అయిదేళ్లుగా అనుమతినివ్వలేదు. గత మూడేళ్లుగా వార్షిక బడ్జెట్‌లో 25శాతానికిపైగా విద్యారంగంపైనే ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి టీచర్‌ ట్రైనింగ్‌ వరకు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పాఠశాలల్లో జరిగే ప్రతీ అంశంలోనూ పిల్లల తల్లిదండ్రుల్ని భాగస్వాముల్ని చేశారు. ఇవన్నీ ఢిల్లీ మోడల్‌గా ప్రచారంలో ఉన్నాయి 

జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఇప్పటికే ప్రచారం ! 

జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావించారు. తాను ఏం చేస్తున్నానో పాజిటివ్‌ ప్రచారాన్ని ప్రారంభించారు.  ఆప్‌ గెలిస్తే తన ఆ«ధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా బీజేపీని మించిపోయి ఆప్‌ చేసిన ప్రచారమే హోరెత్తిరపోయేకలా చేస్తోంది.  అభివృద్ధిలో మోదీ కంటే తాను ఒక అడుగు ముందే ఉన్నానని నిరూపించడానికి కేజ్రీవాల్‌ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని ఎలాగైతే ప్రచారం చేసిందో, అదే స్థాయిలో ఢిల్లీ మోడల్‌ అభివృద్ధిని ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రజారోగ్యం కోసం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌లలో ఉచిత చికిత్స, వైద్య పరీక్షలు, పారదర్శక పరిపాలన, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని తక్కువ సమయంలో, అంచనా వేసిన దానికంటే తక్కువ వ్యయంతో పూర్తి చేయడం వంటివాటితో ఢిల్లీ మోడల్‌ అభివృద్ధిని పాపులర్‌ చేశారు. ఇవన్నీ దేశ ప్రజల్లో ఆయనకు గుర్తింపుతెచ్చాయి. 

"గుజరాత్ మోడల్‌"తోనే మోదీకి విజయాలు !

2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించక ముందు నుంచే గుజరాత్ మోడల్ బాగా పాపులర్ అయింది. గుజరాత్ అభివృద్ధి  పేరుతో విస్తృతంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అయ్యేవి. గుజరాత్ సీఎంగా దాదాపు 12 ఏళ్లకు పైగాపనిచేసిన నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని ప్రగతిదిశగా పరుగులు పెట్టించారని, అభివృద్ధిలో దేశానికి నమూనాగా మలిచారని కమలనాథులు గుక్క తిప్పుకోకుండా చెబుతుంటారు. ఆ ప్రచారంతోనే 2014జనరల్ ఎలక్షన్ లో విజయం సాధించి కేంద్రం లో అధికారం చేపట్టారు. ఇప్పటికీ గుజరాత్‌లో అభివృద్ధిపై కథలు..కథలుగా సోషల్ మీడియాలోప్రచారం జరుగుతూనే ఉంటుంది. 

"గుజరాత్ మోడల్" అంతా ఫేక్ అంటూ ఇటీవల విస్త్రత ప్రచారం !

గుజరాత్‌లో  పారిశ్రామికవేత్తలు.. వ్యాపారవేత్తలు ఉన్నారుకానీ గుజరాత్ లో అభివృద్ధి ఏమీ లేదని ఇటీవలి కాలంలో కొంత మంది పరిశోధనలు చేసిచెప్పడం ప్రారంభించారు.. గుజరాత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రచారం జరుగుతున్నంత బలంగా లేదు.   గుజరాత్ లో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు.  దేశంలోనే అతి పెద్దదైన కచ్ జిల్లా   పరిస్థితులు చూస్తే గుజరాత్ మోడల్ అసలురంగు బయటపడుతుందని కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో అక్కడి బస్టాండ్లు..రోడ్లు వంటి మౌలిక సదుపాయాల ఫోటోలు.. విద్యా రంగం దుస్థితిపై అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానిగా మోడీ ఏడేళ్ల పాలనలో గుజరాత్ మోడల్‌ను అమలు పరిచామని బీజేపీ ఇప్పటికీ గట్టిగా ప్రచారం చేసుకోకపోవడం ... గుజరాత్‌ మోడల్ అనేది ఉత్త ప్రచారమేనని చెప్పే వారికి అస్త్రంగా మారింది. 

గుజరాత్ మోడల్ వర్సెస్ ఢిల్లీ మోడల్‌గా పోటీ ఉంటుందా ?

ఇప్పుడు దేశ అభివృద్ధి విషయంలో గుజరాత్ మోడల్.. ఢిల్లీ మోడల్ అన్నట్లుగా ప్రచారం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మోడల్‌ను కేజ్రీవాల్ విస్తృతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఢిల్లీ మోడల్‌లో హిందూత్వానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరిగిన నిరసనలపై ఆచితూచి వ్యవహరించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి తీర్థయాత్ర కార్యక్రమం కింద తొలి రైలుని ప్రారంభించారు. వైష్ణోదేవి ఆలయం, మథుర, రిషికేష్‌ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే సీనియర్‌ సిటిజ్లకు ఉచిత ప్రయాణం, వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. హనుమాన్‌ చాలీసా చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుందంటూ ఎన్నికలకు ముందు ఒక వీడియో విడుదల చేశారు. ఢిల్లీ మోడల్ పేరుతో విస్తృతంగా ప్రచారం అవుతున్న అభివృద్ది కార్యక్రమాలు.. ఇతర అంశాలు నిజమో కాదో.. ఎవరైనా బయట పెడితేనే తెలుస్తుంది. కానీ.. ఇప్పటికైతే... గుజరాత్ మోడల్ వర్సెస్ ఢిల్లీ మోడల్ అనే రాజకీయాలు ఏర్పడుతున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget