అన్వేషించండి

Cm RevanthReddy: 'ప్రధాని మోదీ, అమిత్ షా నాపై పగబట్టారు' - సాయంత్రం బీజేపీ కుట్రలను బయటపెడతానని సీఎం రేవంత్ సంచలన ప్రకటన

Telangana News: ప్రధాని మోదీ గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం బీజేపీ కుట్రలను బయటపెడతానని సంచలన ప్రకటన చేశారు.

Cm Revanth Reddy Sensational Comments: ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం (మే 1న) సాయంత్రం 5 గంటలకు బీజేపీ (Bjp) కుట్రలను బయటపెడతానంటూ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడారు. గుజరాత్ నుంచి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడి ముఖ్యమంత్రిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ బెదిరించి భయపెట్టిన నిజాం, రాజాకార్లను ఇక్కడి ప్రజలు తరిమికొట్టారని తెలిపారు. 'బలహీన వర్గాలకు దక్కాల్సిన నిధులు, అవకాశాలు రాలేదు. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి. ఈ అంశంపై నేను ప్రశ్నించాను. దీనిపై మోదీ, అమిత్ షా ఢిల్లీలో కేసు పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు.. ఢిల్లీ పోలీసులతోనే భయపెట్టాలని చూస్తున్నారు. ఈ కేసులకు రేవంత్ భయపడడు. మీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చు. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు. మోదీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారు. శపించారు. 5 రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లైనా ఇవ్వలేదు. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఎన్నో ఆటు పోట్లు చూశాను. గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేద్దామనుకుంటున్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోటీ. ప్రెస్ మీట్ పెట్టి ఈ కుట్రలను బయటపెడతాను. రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తుందో వివరిస్తా. రాష్ట్రపతి ప్రసంగంలోనే రాజ్యాంగం మార్పు అంశాన్ని చేర్చారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తాను.' అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

'అందుకు కేసు పెడతారా.?'

'ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా.? గుజరాత్ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా.? ప్రధాని మోదీ భయపెడితే భయపడడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు గతం కంటే చాలా భిన్నమని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని చూస్తోందని.. తద్వారా దేశాన్ని అమ్మోయాలని చూస్తోందని మండిపడ్డారు. 

ఢిల్లీ పోలీసులకు రిప్లయ్

రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా వీడియోను సర్క్యూలేట్ చేశారన్న అభియోగంపై ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేసినందున విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకటో తేదీన రావాలని అందులో పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి విచారణకు ఢిల్లీకి వెళ్లలేదు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్‌ సెల్‌ నేతలు సమాధానం పంపించారు. ఈ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం కావాలని కాంగ్రెస్ లీగల్ సెల్ లేఖలో కోరింది. సీఎంగా ఉన్న రేవంత్‌ రెడ్డి లోకసభ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారని..  ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉండడంతో విచారణకు రాలేమని సమాధానం పంపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని  స్పష్టం చేశారు.   

Also Read: Delhi Police : ఆ ట్విట్టర్ ఖాతా నాది కాదు - ఢిల్లీ పోలీసులకు రిప్లయ్ పంపిన రేవంత్ రెడ్డి

టాప్ హెడ్ లైన్స్

TMC symbol frozen : మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
KCR family 440 acres land: 440 ఎకరాల 'అధికారిక' లెక్కలు - కేసీఆర్ కుటుంబ భూములపై మొదలైన అసలు రచ్చ.. బీఆర్ఎస్ వివరణ ఇవ్వాల్సిందేనా?
440 ఎకరాల అధికారిక లెక్కలు - కేసీఆర్ కుటుంబ భూములపై మొదలైన అసలు రచ్చ.. బీఆర్ఎస్ వివరణ ఇవ్వాల్సిందేనా?
Danam Nagender Disqualification: దానంపై వేటు తీర్పుతో కలకలం.. మరి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితేంటి? చట్టం ఏం చెబుతోంది?
దానంపై వేటు తీర్పుతో కలకలం.. మరి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితేంటి? చట్టం ఏం చెబుతోంది?

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget