Chandrababu On Botsa : బొత్సకు విద్యాశాఖేనా పద్మశ్రీ కూడా ఇవ్వాలి - విజయనగరంలో చంద్రబాబు సెటైర్లు
బొత్సకు పద్మశ్రీ ఇవ్వాలి- విజయనగరం జిల్లాలో చంద్రబాబు డిమాండ్ చేశారు. సారా వ్యాపారం మాత్రమే తెలిసిన బొత్స సత్యనారాయణ విద్యామంత్రి అని చంద్రబాబు సెటైర్లు వేశారు.
Chandrababu On Botsa : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఓ కొత్త ప్రతిపాదన చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు పద్మశ్రీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు సెటైర్ కు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మీటింగ్ లో మంచి రెస్పాన్సే వచ్చింది.
తెలుగుదేశం పార్టీ మీటింగులకు జనాల సంఖ్య బాగా పెరుగుతుండటంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబులో కూడా హుషారు కనిపిస్తోంది. ఎప్పటిలా రొటీన్ గా మాట్లాడకుండా ఆయన సభల్లో సెటైర్లు వేస్తున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. బొత్స సత్యనారాయణపై కొత్తగా కౌంటర్లు వేశారు. నెల్లిమర్ల రోడ్ షో లో పాల్గొన్న ఆయన.. విద్యాశాఖను బొత్స సత్యనారాయణకు ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు. సారా వ్యాపారం చేసుకునే బొత్సకు పిల్లల చదువుల గురించి ఎలా తెలుస్తుందన్నారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి వారి తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడమే కారణమన్న బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను విద్యా మంత్రిని చేశారు.. అంటూ.. జగన్ మోహనరెడ్డిని ఉద్దేశించి అన్నారు.
మరోసారి పోలవరానికి కేంద్ర నిపుణుల కమిటీ - ఈ సారైనా క్లారిటీ క్లారిటీ ఇస్తారా ?
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అని చెప్పడానికే కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ చదువు, నేపధ్యం అన్నీ చూసిన వారికి.. తెలిసిన వారికి ఆ శాఖ ఇస్తారని ఎవరూ ఊహించరు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భిన్నంగా ఆలోచించారు. ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారు. అందుకే అప్పుడప్పుడూ ఈ విషయం ట్రోలింగ్ అవుతూనే ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు సరే సరి.
నాయకుడ్ని తేల్చుకునేదాకా గందరగోళమే ! జాతీయ స్థాయిలో విపక్షాలు ఎప్పుడు తేల్చుకుంటాయి ?
విజయనగరం జిల్లాలో బొత్స లిక్కర్ షాపులను నడిపేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్ షాపులను నడుపుతోంది కాబట్టి ఆయన అనుచరులు బార్లను నడుపుతున్నట్లుగా చెబుతారు. చాలా సార్లు అవును తాను మద్యం వ్యాపారం చేశాను అయితే తప్పేంటి అని కూడా బొత్స వాదించారు. తప్పేం లేదు కానీ ఇప్పుడు అలాంటి బ్యాక్ గ్రౌండ్ పెట్టుకుని విద్యా శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూండటమే రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది.
అనుచిత భాషలో వైఎస్ఆర్‌సీపీతో పోటీ పడుతున్న టీడీపీ నేతలు ! ట్రాప్‌లో పడ్డారా ?
బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ ప్రకటించినప్పుడే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఆయనకు ఇంగ్లిష్ పెద్దగా రాదు. అయితే ఓ సందర్భంలో ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది తేడా కొట్టేసింది. ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉటుంది. దాన్ని చూపించి ఈయన మన విద్యాశాఖ మంత్రి అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. నిజానిక బొత్సకు కూడా విద్యాశాఖ ఇష్టం లేదని ప్రచారం జరిగింది. చాలా రోజుల పాటు ఆయన బాధ్యతలు కూడా తీసుకోలేదు. ఆ శాఖపై పట్టు సాధించడం సాధ్యం కాదనుకుని ఎక్కువగా అధికారులకే వదిలేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన విజయవంతంగా సాగుతోంది. ప్రతీచోట పెద్ద సంఖ్యలో జనం ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. జనాల్లో స్పందన బాగుండటంతో చంద్రబాబు కూడా మరింత హుషారుగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే విధానం బాగా మారింది. జగన్ మోహనరెడ్డి.. చాలా పనులు చేస్తున్నారని.. అద్భుతం అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. జగన్ మోహనరెడ్డి ఫిష్ మార్కెట్లు, మటన్ కొట్లు తీసుకొచ్చి.. యువతకు ఉపాధి కల్పించారని.. ఎద్దేవా చేశారు.