(Source: ECI/ABP News/ABP Majha)
Who Is Opposition Leader : నాయకుడ్ని తేల్చుకునేదాకా గందరగోళమే ! జాతీయ స్థాయిలో విపక్షాలు ఎప్పుడు తేల్చుకుంటాయి ?
జాతీయ స్థాయిని మోదీకి ప్రత్యామ్నాయంగా నిలబడే నేత ఎవరో విపక్షాలు తేల్చుకోలేకపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రపతి ఎన్నికల్లాంటి వాటిపై కూడా వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.
Who Is Opposition Leader : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి షాకివ్వాలని.. బీజేపీ, నరేంద్రమోడీకి వ్యతిరేకంగా... విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఓ వైపు సోనియా గాంధీ మరో వైపు మమతా బెనర్జీ విపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం మోదీకి తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవడమే. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోదీ ఉంటారు. విపక్షాల తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరు మోదీని ఢీకొడతారు..? దీనికి ఇంత వరకూ సమాధానం దొరకలేదు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేసీఆర్ ఇలా చాలా మంది రేసులో ఉన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక కూటమి వీక్‌గా కనిపిస్తోంది.
గందరగోళంలో బీజేపీ వ్యతిరేక పక్షాలు !
రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు నిర్వహించిన భేటీ ఫలితం లేకుండానే ముగిసింది. దీనికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీయేతర పక్షాల కూటమికి నాయకత్వ వహించాలని చాలా మంది నేతలు ఆశ పడుతున్నారు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సహా అనేక పార్టీలు సమర్థించవు. మమతా బెనర్జీతో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా.. ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
హిందూపురం ఇక్బాల్‌కే - అసమ్మతి నేతలకు షాక్ ఇచ్చిన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ !
మోదీ వర్సెస్ రాహుల్ , మమతా, కేసీఆర్ !
బీజేపీయేతర పక్షాలకు.. ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. భారత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎంపీలు ఎన్నికవుతూంటారు. ప్రధానమంత్రి అభ్యర్థిని బట్టి కాదు. గత ఎన్నికల్లో చూసుకుంటే.. దక్షిణాదితో పాటు.. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా మోదీ మానియాను చూసి ఎవరూ ఓటేయలేదు. అయితే ప్రాంతీయ పార్టీ అధినేతగా కేసీఆర్ ఆ అడ్వాంటేజ్ సాధించలేరు. అందుకే జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మోడీ,, రాహుల్ గాంధీ ముఖాముఖి తలపడటం లేదు. కాంగ్రెస్, బీజేపీ చాలా రాష్ట్రాల్లో ప్రత్యర్థులు కూడా కాదు. కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంది. మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయపార్టీలతో పోటీ పడుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో చూస్తే మాత్రం.. మోడీ వర్సెస్ రాహులే అవుతోంది. ఇలాంటి పరిస్థితి మారి కేసీఆర్ వర్సెస్ మోదీ అవ్వాలంటే జాతీయ పార్టీ అనివార్యం అయింది.
అనుచిత భాషలో వైఎస్ఆర్‌సీపీతో పోటీ పడుతున్న టీడీపీ నేతలు ! ట్రాప్‌లో పడ్డారా ?
ముందు బీజేపీని ఓడించడం టార్గెట్‌గా పెట్టుకోవాలి !
గెలిచిన తర్వాత నాయకుడు ఎవరు అని ఆలోచించవచ్చు..కానీ ముందుగా బీజేపీని ఓడించడం టార్గెట్‌గా పెట్టుకోవాలన్నది ఎక్కువ మంది చెప్పే మాట. బీజేపీని ఓడించడం చిన్న విషయం కాదు. అందరూ కలిసినా ఓడించగలరా అన్నసందేహాలు ఉన్నాయి.అయితే ఇక్కడ అందరూ కలవడానికే ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి నిర్వహించిన సమావేశానకి బీజేపీని వ్యతిరేకిస్తామని చెప్పిన టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు కూడా రాలేదు. అందుకే.. ముందుగా విపక్షాలు మోదీని ఎదుర్కొనే నాయకుడెవలో తేల్చుకుని ఆయన రాజకీయ రణంలోకి దిగాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.