(Source: ECI/ABP News/ABP Majha)
Central funds allocations:కేంద్రం నిధులు.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. నిజమెంత? పెరుగుతున్న పోరు!
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను కూడా తమకు ఇవ్వడం లేదని.. దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్నాయి. దీనిలో ఏపీ కూడా ఉంది. సీఎం జగన్ అసెంబ్లీలోనూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని చెప్పారు.
Central Funds Allocations: దేశం(Country)లో అమలవుతున్న పన్నుల విధానం గూడ్స్ సర్వీస్ ట్యాక్స్(GST).. దీని ప్రకారం.. ఏ వస్తువుపైనైనా.. పన్నులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్ర, మరొకటి రాష్ట్ర ప్రభుత్వాల(State Governaments)కు చేరే పన్నులు. వీటిలోనూ.. రాష్ట్ర వాటా పక్కన పెడితే.. కేంద్రం తీసుకునే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అది జనాభా లెక్కలు(Census), అదేసమయంలో ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది. జనాభా దామాషా పద్ధతి ప్రకారం.. కొన్నాళ్లు పన్నుల్లో వాటా ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నించింది. కానీ, రాష్ట్రాలు వద్దని నిరసన వ్యక్తం చేశాయి. దీంతో అప్పటి నుంచి అంటే.. 2016-17 నుంచి ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారు.(పన్నుల్లో వాటా)
నిధులు చాలక..
ఒకప్పుడు పన్నుల్లో వాటా ఎలా ఉన్నా.. కేంద్రం(Centre) నుంచి ఇన్సెంటివ్స్ ఎక్కువగా వచ్చేవి. కానీ, వీటిని దాదా పు నిలుపుదల చేశారు. అప్పులు చేసుకునేదిశగానే రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఎడా పెడా అప్పు లు పెరిగిపోయి.. దాదాపు ఈశాన్య రాష్ట్రాల నుంచి అతి పెద్ద రాష్ట్రాల వరకు కూడా గగ్గోలు పెడుతున్నాయి. ఫలితంగా కేంద్రం ఇచ్చే పన్నుల్లో వాటాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థిక సంఘాలు సిఫారసు చేసిన మేరకు .. తమ రాష్ట్రాల నుంచి తీసుకున్న పన్నల్లో వాటాలను తమకు చెల్లించాలని పట్టుబడుతున్నాయి.
కేంద్రం ఏం చేస్తోంది?
ఆర్థిక సంఘం(Finance committee) చేసిన సిపారసుల(recomandations) మేరకు తాము రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇస్తున్నామని.. కేంద్రం పదే పదే చెబుతోంది. ఒకప్పుడు ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత బలం పుంజుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా చేస్తున్నారు. ఉదాహరణకు అసోం(Assam), యూపీ(UP), హరియాణ(Hariyana), గుజరాత్(Gujath) వంటివి కీలకంగా ఉన్నాయి. కానీ, ఇక్కడ నుంచి వసూలు చేస్తున్న పన్నులకు.. ఆర్థిక సంఘాలు సిఫారసు చేస్తున్న పన్నుల్లో వాటాలకు సంబంధం లేకుండానే కేంద్రం నిధులు ఇచ్చేస్తోందన్నది దక్షిణాది రాష్ట్రాల ఆరోపణ.
కారణం ఏంటి?
దక్షిణాది రాష్ట్రాల్లో పన్నుల వాటా అంశం ఇప్పుడు కొత్తకాదు. ఇది దాదాపు ఏడెనెమిదేళ్లుగా సాగుతున్న యుద్ధమే. ఒక్క దక్షిణాది మాత్రమే కాదు.. పశ్చిమ బెంగాల్ నుంచి ఇదే తరహా డిమాండ్లు వినిపిస్తున్నా యి. తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా.. అసెంబ్లీలో పన్నుల వాటా గురించి మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం 35 శాతాం వాటా ఇవ్వాలని చెబితే.. కేంద్రం కేవలం 30 శాతమే ఇచ్చిందని, 15 వ ఆర్థిక సంఘం.. 28 శాతం వాటా ఇవ్వాలని చెబితే.. 22 శాతమే ఇచ్చారని గణాంకాలతో సహా వెల్లడించారు. అయినప్పటికీ.. సంక్షేమాన్ని ఆపకుండా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు.
నేడు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటాలను సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలైన(southern states) కర్ణాటక(Karnataka), కేరళ(Kerala) ప్రభుత్వాలు .. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని.. ప్రధానంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి.. మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర నేతలను ఇప్పటికే ఢిల్లీకి తరలించింది. మరోవైపు.. కేరళలోని పినరయి విజయన్ సర్కారు కూడా.. ఇదే రీతిలో ఉద్యమానికి రెడీ అయింది. ఈ రెండు ప్రభుత్వాలకు తమిళనాడులోని డీఎంకే సర్కారు మద్దతు తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు.. అదనంగా వాటా ఇస్తున్న ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నారని వారి వాదనగా ఉంది.
కేంద్రం ఏం చెబుతోంది?
పన్నుల కేటాయింపు విషయంలో కేంద్రంపై రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలను కేంద్రం తిప్పికొడుతోంది. తమకు ఎలాంటివివక్ష లేదని.. ఆర్థిక సంఘాలు చేస్తున్న సిఫారసుల మేరకు పన్నుల్లో వాటాలు ఇస్తున్నామని.. చెబుతోంది. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు విరివిగా ఉచిత పథకాలు ప్రకటించాయని, తద్వారా వాటిని అమలు చేయలేక.. తమపై నిందలు మోపుతున్నాయని అంటోంది.