అన్వేషించండి

YS Sharmila: మిమ్మ‌ల్ని అసెంబ్లీకి ర‌మ్మంటే, సోషల్ మీడియాలో న‌న్ను తిట్టిస్తారా! వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila | ష‌ర్మిల మ‌రోసారి అధికార ఎన్టీఏ కూట‌మి, ప్ర‌తిప‌క్ష వైసీపీపై ఎక్స్ వేదికగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీకి పోవ‌డం లేద‌ని జ‌గ‌న్‌ని, ఆమె ఘాటుగా విమ‌ర్శించారు.

YS Sharmila Strong Couter to YSRCP ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌న అన్న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై మాటల దాడి కొనసాగిస్తున్నారు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత విమర్శలు మ‌రింత పెంచారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తి చ‌ర్య‌ను త‌ప్పుబ‌డుతూ ఆమె ఎక్స్ వేదిక‌గా, ప్రెస్‌మీట్‌ల‌లో విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. అన్న‌పై త‌న కోపాన్ని ఏమాత్రం దాచుకోకుండా ఎంత‌వ‌ర‌కైనా వెళ్ల‌డానికి సిద్ధం అనేలా ఆమె దాడిని కొన‌సాగిస్తున్నారు.

చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తుంటే మీకేం ఇబ్బంద‌ని, ఆయ‌నకు న‌ష్టం జ‌రుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నార‌ని వైసీపీ అఫిషియ‌ల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి ష‌ర్మిల‌కు రిప్లై రాగానే ఆమె ఇదే అద‌నుగా మ‌రింత రెచ్చిపోతున్నారు. క‌నీసం అన్న అనే భావ‌న కూడా లేకుండా సిగ్గు సిగ్గు, మూర్ఖులు, పిచ్చి ప‌ట్టింది, ముఖం  అద్దంలో చూసుకోండి అనే ఘాటు  ప‌దాల‌తో దాడి చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. తాజాగా వైసీపీ పోస్టుకు తాను రిప్లై ఇచ్చారు. YSRCPలో వైఎస్ఆర్‌(YSR)ని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అంటూ మ‌రింత సూటిగా విమ‌ర్శ‌లు గుప్పించారు. మిమ్మ‌ల్ని అసెంబ్లీకి ర‌మ్మ‌న‌డం త‌ప్పా.. దానికి సోష‌ల్ మీడియాలో న‌న్ను తిట్టిస్తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆమె ఏమ‌న్నారంటే..  "జగన్ మోహన్ రెడ్డి @ysjagan అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడు.  సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది.  ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు! కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం!

వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు  మీరు అధికారంలోకి  వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. 
అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు.  @YSRCParty YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం 
Y అంటే వైవీ సుబ్బారెడ్డి,
S అంటే సాయిరెడ్డి,
R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు.  కనుక  వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ.  

మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫి చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా ? 3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. 4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..?

మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టారు! మీ అహంకారమే మీ పతనానికి కారణం! "అంటూ త‌న సందేశాన్ని ముగించారు. 

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఢిల్లీని ప్ర‌శ్నించ‌లేరా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌..

మ‌రో ట్వీట్‌లో మూడు వారాలుగా వ‌ర్షాల‌తో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు అల్లాడుతుంటే ప్ర‌భుత్వం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లపై దృష్టిసారించ‌కుండా  పున‌రావాస కేంద్రాలంటూ చోద్యం చూస్తుందని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ల‌ను వైఎస్ షర్మిల దుయ్య‌బ‌ట్టారు. బిహార్ రాష్ట్రానికి ఇచ్చిన వ‌ర‌ద సాయం, ఏపీకి కేంద్రం ఎందుకు ఇవ్వ‌దంటూ ప్రశ్నించ‌డం లేద‌ని ఆరోపించారు. మీకింకా నీతి అయోగ్ స‌మావేశాలు కాలేదా, కోన‌సీమ మునిగిపోతుంటే ప్ర‌జ‌ల‌ను ఇంకెప్పుడు ప‌ట్టించుకుంటారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న బాధితుల‌కు మీరు చేస్తున్న సాయంపై స్ప‌ష్ట‌త ఏద‌ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌ల‌ను ఎక్స్‌లో ట్యాగ్ చేసి ప్ర‌శ్నించారు. రెండు ల‌క్ష‌ల ఎక‌రాల‌లో పంట న‌ష్టం జ‌రిగి దాదాపు రూ. 800 కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని ఆమె పేర్కొన్నారు. 25 మంది ఎంపీలూ బీజేపీకే మ‌ద్ద‌తిస్తున్న‌ప్పుడు ఏపీపై ఎందుకింత నిర్ల‌క్ష్య ధోర‌ణితో ఉన్నారు,  రాష్ట్రాన్ని ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అడిగే ధైర్యం చేయ‌రా అని ష‌ర్మిల కోరారు.


"నేటికీ దాదాపు మూడు వారాలు, అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి. రైతుల అర్తనాధాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు, రైతులు, ప్రజలూ అలకల్లోలంలో కొట్టుకుపోతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుంది. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది?

బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసింది. మరి ఏపీకి ఎందుకు ఇవ్వదు. ఏపీ పట్ల ఎందుకు కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి? ఏపీకి చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా..? మరి ఢిల్లీలో మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పటికీ ప్రాథమిక అంచనా, మధ్యంతర అంచనా జరిపించారా లేదా? నష్టపరిహారం మీద ఇంకా స్పష్టత లేదు? 

ఇవన్నీ వదిలేసి, పునరావాస కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడుతూ, కనీసం ఎప్పుడు పర్యటిస్తారో కూడా చెప్పకపోవడం ప్రజల్ని తీవ్రంగా కలచివేస్తోంది. రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రతి రైతు ఎకరానికి రూ.15000 రూపాయలు ఖర్చుపెట్టాడు. అంతేకాకుండా ఆస్తి నష్టం కూడా జరిగింది. మొత్తం నష్టం కలిపి సుమారు రూ.800 కోట్లు(అంచనా). 

మరి ఇంత భారీ ఎత్తున పంట నాశనం అయితే ఆదుకోవాల్సింది సర్కారే కాదా? మెడ లోతు నీళ్లలో మునిగి మేము కాంగ్రెస్ నాయకులం రైతన్న కష్టాన్ని మీకు వివరించాము. మా నిబద్ధతలో మీకు పావు వంతు ఉన్నా మీ సర్కారు ఈ నిర్లక్ష్యం చూపదు. కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వెంటనే వరద పీడిత ప్రాంతాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించి, రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలి’ అని షర్మిల సూచించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget