అన్వేషించండి

Unwanted Party BJP : మద్దతు కావాలి కానీ పొత్తులొద్దు - ఏపీ బీజేపీకి ఈ కష్టం దేనికి !?

ఏపీ బీజేపీ మద్దతు కావాలి కానీ పొత్తులొద్దంటున్న పార్టీలు. ఆంధ్రలో కమలానికి దారేది ?

Unwanted Party BJP : ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులు ఎవరూ లేరు. అందరూ మిత్రులే. జనసేన పార్టీ నేరుగా పొత్తులో ఉంది. కానీ అది పేరుకే. కానీ కలిసి పోటీ చేస్తామని మాత్రం చెప్పడం లేదు. దేశం కోసం బీజేపీకి మద్దతిస్తామని .. వైఎస్ఆర్‌సీపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ  బీజేపీ పెద్దలు వచ్చి తీవ్ర విమర్శలు చేసినా వారు బీజేపీకే మద్దతంటున్నారు. బీజేపీ పెద్దలు అన్న మాటల వారివి కావని.. టీడీపీ మాటలని కవర్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో సఖ్యతగా ఉంటోంది కానీ.. పొత్తుల గురించి మాట్లాడటం లేదు. దీంతో ఏపీ బీజేపీ అర్థం కాని రాజకీయం చేయాల్సి వస్తోంది.  దీంతో ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతోంది. 

కలిసి పోటీ చేస్తే ముస్లిం ఓట్లు మైనస్ అవుతాయనుకుంటున్న పవన్

భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే విషయంలో పవన్ కల్యాణ్ అంత ఆసక్తిగా లేరు. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడటం లేదు. కానీ గతంలో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని..  ఒప్పుకోకపోతే ఒప్పిస్తామన్న ప్రకటనలు కూడా చేశారు. అయితే ఒక్క  బీజేపీతో కలిసి పోటీ చేసే విషయంలో ఆయన సానుకూలంగా లేరు. అాలా ఉంటే ఈ పాటికి రెండు పార్టీలు కలిసి రాజకీయ ప్రయాణం చేస్తూ ఉండేవి.  పైగా ముస్లింలతో  మాట్లాడినప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు బీజేపీ వైపు నుంచి  ఇబ్బంది వస్తే.. తాను ఊరుకోనన్నారు. అవి ఎలాంటి ఇబ్బందులో చెప్పలేదు కానీ.. ఆ పార్టీతో ఉంటే ముస్లింలు ఓట్లు వేయరన్న అభిప్రాయం మాత్రం పరోక్షంగా వ్యక్తం చేశారని అనుకుంటున్నారు. 

పరోక్షంగా మద్దతు..కనీసం న్యూట్రల్ గా ఉంటే చాలనుకుంటున్న టీడీపీ 

భారతీయ జనతా పార్టీ విషయంలో టీడీపీ వ్యతిరేకంగా లేదు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు చేయలేదు కాబట్టి వ్యతిరేకించి .. పోరాటం ఆ పార్టీ మీదే అన్నట్లుగా రాజకీయ వ్యూహం అమలు చేశారు. అది రివర్స్ అయింది. ఇప్పుడు ఆ పార్టీపై పోరాడాల్సిన అవసరం కనిపించడం లేదు. అందుకే చంద్రబాబు సానుకూలంగా మాట్లాడుతున్నరు. కానీ పొత్తుల దగ్గరకు వచ్చే సరికి స్పందించడం లేదు. బీజేపీకి ప్రస్తుతం ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు.  అందుకే.. సీట్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని అనుకుంటున్నారు. కానీ బీజేపీ మద్దతు కోరుకుంటున్నారు. మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు.. వైసీపీ విషయంలో సానుకూలంగా ఉండకుండా న్యూట్రల్ గా ఉండాలంటున్నారు. బీజేపీ నుంచి టీడీపీ ప్రస్తుతం కోరుకుంటున్నది అదే. 

అంతా తెరవెనుక సహకారాలు చాలనుకుంటున్న వైసీపీ

ఇక బీజేపీ పెద్దలు తీవ్రమైన ఆరోపణలు చేసినా సరే.. తాము బీజేపీకే మద్దతు ఇస్తాం అనే రాజకీయ చక్రబంధంలో వైఎస్ఆర్‌సీపీ ఉంది. షరతుల్లేకుండా మద్దతిస్తున్న తమపై బీజేపీ ఎటాక్ చేయదని గట్టి నమ్మకంతో ఉన్నారు. విమర్శలు ఎన్ని చేసినా..  పాలనా పరంగా సహకరిస్తారని అనుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీ ఇప్పటి వరకూ వైసీపీని ఇబ్బంది పెట్టలేదు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు వైసీపీ అంగీకరించే అవకాశం లేదు. ఎందుకంటే.. ఆ పార్టీ కోర్ ఓటు బ్యాంక్ దూరమయ్యే ప్రమదం ఉంది. 

ఎలా చూసినా ఏపీలో బీజేపీని ఎవరూ వ్యతిరేకించడం లేదు. అందరూ అభిమానిస్తున్నారు. కానీ అది ఓట్లు వేయడానికి కాదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని చూసి. అయితే ఈ రాజకీయ పద్మవ్యూహంలో ఎలా ముందుకెళ్లాలో బీజేపీ తేల్చుకోలేకపోతోంది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget