అన్వేషించండి

AP New Cabinet : జగన్ మినహా మంత్రులంతా ఆ రోజే రాజీనామా ! తర్వాత...

జగన్ మినహా మంత్రులంతా రాజీనామా చేయడానికి ముహుర్తం ఖరారైంది. ఉగాదికి కొత్త మంత్రివర్గం కొలువు దీరనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులందరూ ఈ నెల 27వ తేదీన రాజీనామా చేసే అవకాశం ఉంది. కొత్త మంత్రులను తీసుకునేందుకు సీఎం జగన్‌కు అవకాశం కల్పిస్తూ వారంతా రాజీనామా చేయనున్నారు. ఏప్రిల్ రెండో తేదీన ఉగాది రోజున సీఎం జగన్ మరోసారి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రోజున పర్వదినం కావడం.. కొత్త జిల్లాలు కూడా అదే రోజున ఉనికిలోకి రానుండటంతో..  కొత్త మంత్రివర్గాన్ని కూడా అదే రోజున ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఏపీ రాజకీయాలను మార్చనున్న "రోడ్ మ్యాప్" ! బీజేపీ నుంచి పవన్ కోరుతున్నదేంటి ?

నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సీఎం జగన్ కాకుండా ఇరవై ఐదు మంది మంత్రులు ఉండటానికి అవకాశం ఉంది. ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సీఎంతో సహా ఇరవై ఆరు మంది మంత్రులు .. ఇరవై ఆరు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేటట్లు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోలా ఈ సారి కూడా ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీ, మహిళల కోటా కింద ఒక్కొక్కరికి ఉపముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తారు. పాత మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 

ఏపీలో కొత్త పార్టీకి రంగం సిద్ధం.. త్వరలోనే దిల్లీలో బ్రదర్ అనిల్ ప్రకటన!

అయితే వంద శాతం మంత్రులను తొలగిస్తారో లేదోస్పష్టత లేదు. సామాజికవర్గాలు...ఇతర కారణాలతో కొంత మందిని కొనసాగిస్తామని సీఎం జగన్ కేబినెట్ భేటీలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వంద శాతం మంత్రుల్ని మార్చేస్తారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలకూడా ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే మార్చి 27వ తేదీన మంత్రులందరి వద్ద  రాజీనామాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత రెండో తేదీన జరిగే మంత్రివర్గ ప్రమణస్వీకారానికి వీరిలో మళ్లీ కొంత మందికి పిలుపు వస్తే సరే.. లేకపోతే అందరికీ పార్టీ పనులు అప్పగిస్తారని అనుకోవచ్చు.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే .. రెండున్నరేళ్లకు ఎనభై శాతం మంది మంత్రులను మార్చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ ప్రకారం మార్చాలని అనుకున్నా... వివిధ కారణాలతో ఐదు నెలలు ఆలస్యం అవుతోంది. వచ్చే ఎన్నికల కోసం కొత్త టీంను సీఎంజగన్ రెడీ చేసుకుంటున్నారు. వీరి నాయకత్వంలోనే వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల పోరాటం చేయనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduates MLC Election : కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
కాంగ్రెస్ సర్కార్‌కి లిట్మస్ టెస్ట్- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుపై విద్యావంతుల తీర్పు ఏంటి?
Nara Lokesh: మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
YS Jagan AP Local Body Elections: సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget