టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2 దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా వరంగల్ నగరంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.
సీఎం కేసీఆర్ అభీష్టం మేరకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులను, మద్దతుదారులను వచ్చేలా చేసి సభను విజయవంతం చేయడానికి అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహించారు. ఈ నెలలో తమకు సెంటిమెంట్ అయిన వరంగల్ లో భారీ సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
20 ఏళ్ల తమ ప్రస్థానంతో పాటు గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసిఆర్ తమ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు సభా స్థలాన్ని పరీశీలించిన వారిలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు
NTR 32 Exclusive : ట్రెండింగ్లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?
Constable Stage 2 Registration: కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లకు 95,208 మంది అభ్యర్థులు ఎంపిక! స్టేజ్-2 దరఖాస్తు షెడ్యూలు ఇదే!