రెండు రోజులుగా జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామి వారికి కేంద్రమంత్రి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు కిషన్ రెడ్డికి అందజేశారు. దర్శనం తర్వాత కొండపైన పునర్నిర్మాణం అవుతున్న ప్రధాన ఆలయాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం భువనగిరిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి మూడో రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌లో ఓడించడమే టీఆర్ఎస్ అజెండాగా పెట్టుకుంది.’’ అని అన్నారు.
‘‘కేసీఆర్‌తో పాటు మంత్రులంతా హుజూరాబాద్‌లోనే ఉంటున్నారు. వారి వ్యూహాలు తిప్పికొట్టాలి. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
దేశంలో పర్యటక రంగాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్‌లుగా చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
In Pics : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన, క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పరామర్శ
Yadadri: వైభవంగా యాదాద్రి మహాసంప్రోక్షణ, సీఎంతోపాటు హాజరైన టీఆర్ఎస్ లీడర్లు
Yadadri Temple Photos: యాదాద్రి ఆలయ వైభవం, తాజా డ్రోన్ ఫోటోలు చూసేయండి
Mahila Bandhu Photos: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహిళా బంధు కేసీఆర్ వేడుకలు
KCR birthday Celebrations : తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!