అన్వేషించండి
iPhone New Update: పిల్లల భద్రతకు ఐఫోన్లలో కొత్త ఫీచర్.. దీంతో అశ్లీలతకు చెక్!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/f0010460b5e78f02e04b5386e5757ab7_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పిల్లల భద్రతకు ఐఫోన్లలో కొత్త ఫీచర్
1/4
![పిల్లల భద్రత కోసం యాపిల్ సంస్థ సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఎస్ఏఎం), అశ్లీలతకు సంబంధించిన కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు కొత్త టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఐఫోన్లలో ఫొటోలు, మెసేజ్‌లను స్కాన్ చేసేలా ఈ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/f2c96a80e9ef7235c2fe2ade1e18abc14cf73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పిల్లల భద్రత కోసం యాపిల్ సంస్థ సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఎస్ఏఎం), అశ్లీలతకు సంబంధించిన కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు కొత్త టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఐఫోన్లలో ఫొటోలు, మెసేజ్‌లను స్కాన్ చేసేలా ఈ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
2/4
![ఈ కొత్త సాఫ్ట్ వేర్ మ్యాచింగ్ టెక్నిక్‌ను ఉపయోగించనుంది. దీని ద్వారా వినియోగదారుల ఫోన్లలో స్టోర్ అయిన ఫొటోలు, మెసేజ్‌లు స్కాన్ అవుతాయి. ఫొటోలు, మెసేజ్‌లలో అశ్లీలత ఉందేమో చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే యూజర్లను అలెర్ట్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/9de1182798350c0420fc6b802c4e7f3f5b99c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కొత్త సాఫ్ట్ వేర్ మ్యాచింగ్ టెక్నిక్‌ను ఉపయోగించనుంది. దీని ద్వారా వినియోగదారుల ఫోన్లలో స్టోర్ అయిన ఫొటోలు, మెసేజ్‌లు స్కాన్ అవుతాయి. ఫొటోలు, మెసేజ్‌లలో అశ్లీలత ఉందేమో చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే యూజర్లను అలెర్ట్ చేస్తుంది.
3/4
![ఇదే ఫీచర్ ఫేస్‌బుక్ సహా పలు యాప్స్‌లోనూ ఉంది. అయితే ఇవన్నీ యూజర్ ఫొటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత అశ్లీలతను చెక్ చేస్తాయి. యాపిల్ ఓ అడుగు ముందుకేసి.. అప్‌లోడ్ చేయకముందే స్కాన్ చేసేట్లుగా రూపొందిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/a90ac5cf489ce0ed31184ba2be8d56ee1dde0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదే ఫీచర్ ఫేస్‌బుక్ సహా పలు యాప్స్‌లోనూ ఉంది. అయితే ఇవన్నీ యూజర్ ఫొటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత అశ్లీలతను చెక్ చేస్తాయి. యాపిల్ ఓ అడుగు ముందుకేసి.. అప్‌లోడ్ చేయకముందే స్కాన్ చేసేట్లుగా రూపొందిస్తోంది.
4/4
![అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇనిస్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మాథ్యూ డేనియల్ గ్రీన్.. ఈ విషయంపై ట్వీట్ చేశారు. పిల్లల అశ్లీల చిత్రాలను గుర్తించడానికి క్లయింట్ సైడ్ సిస్టమ్‌ను ప్రారంభించే యోచనలో యాపిల్ ఉందని తెలిపారు. ఎన్‌క్రిప్ట్ చేయబడిన మెసేజింగ్ సిస్టమ్‌లపై నిఘా పెట్టడానికి ఈ కొత్త టూల్ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ టూల్ ద్వారా ఫోన్లపై నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయని, ఇది ప్రభుత్వాలకు ఆయుధంగా మారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/061101863d4c516c6e1d50e62dffaa6f77f6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇనిస్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మాథ్యూ డేనియల్ గ్రీన్.. ఈ విషయంపై ట్వీట్ చేశారు. పిల్లల అశ్లీల చిత్రాలను గుర్తించడానికి క్లయింట్ సైడ్ సిస్టమ్‌ను ప్రారంభించే యోచనలో యాపిల్ ఉందని తెలిపారు. ఎన్‌క్రిప్ట్ చేయబడిన మెసేజింగ్ సిస్టమ్‌లపై నిఘా పెట్టడానికి ఈ కొత్త టూల్ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ టూల్ ద్వారా ఫోన్లపై నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయని, ఇది ప్రభుత్వాలకు ఆయుధంగా మారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
Published at : 06 Aug 2021 12:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion