గాయంతో రవీంద్ర జడేజా దూరమవ్వడం, సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని అన్‌ఫాలో కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటను చూస్తుంటే 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను సైడ్ చేసిన తీరు గుర్తొస్తోందని చాలామంది నెటిజన్లు అంటున్నారు.
ఐపీఎల్ 2021లో సరైన ఆటగాళ్లు లేకపోవడం, అడిగిన వారిని తుది జట్టులోకి ఇవ్వకపోవడంతో డేవిడ్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాంతో ఆ జట్టు వరుసగా ఓటముల పాలైంది. అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ఐపీఎల్ 2022లోనూ ఆటగాళ్లు లేకపోవడం, రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ కొత్తకావడం తెలిసిందే. సమతూకం కుదరక వరుస మ్యాచుల్లో ఓడిపోవడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. విమర్శలు వచ్చాయి.
బాగా ఆడటం లేదని సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. సడెన్‌గా ఒక మ్యాచులో అవకాశం ఇవ్వలేదు. తుది జట్టులోకి తీసుకోలేదు. మరో మ్యాచులోనైతే కరోనా నిబంధనల దృష్ట్యా హోటల్లోనే ఉండిపొమ్మని చెప్పారు. సీజన్ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వచ్చినా ఎక్కువ మ్యాచులు ఆడించలేదు. ఆ తర్వాత రీటెయిన్ చేసుకోలేదు.
ఐపీఎల్ 2022లో బాగా ఆడటం లేదని, ఆటపై శ్రద్ధ పెట్టాలని కెప్టెన్సీని జడ్డూ వదిలేశాడని చెప్పారు! ధోనీ సారథ్యంలో ఆడాలనుకుంటున్నాడని యాజమాన్యం ప్రకటించింది. బెంగళూరు మ్యాచులో గాయపడటంతో తర్వాత మ్యాచులో అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత రెండు రోజులకే గాయం తీవ్రత గురించి చెప్పకుండానే ముందు జాగ్రత్తగా ఐపీఎల్ నుంచి తొలగిస్తున్నామని సీఎస్‌కే చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యింది. అందుకే వార్నర్, జడ్డూ ఉదంతాలు ఒకేలా ఉన్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. (All Image:BCCI)
PBKS vs RCB: మ్యాచ్ ఓడాక.. తొడ గొడుతూ భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ!
IPL 2022: తండ్రేమో గుజరాత్ కెప్టెన్ కొడుకేమో LSGకి సపోర్ట్! బుల్లి పాండ్య భలే భలే!
IPL 2022, RCB: సన్‌రైజర్స్ మ్యాచులో జెర్సీ మారుస్తున్న ఆర్సీబీ- రీజన్ తెలుసా?
IPL 2022: మిట్ట మధ్యాహ్నం.. 45 డిగ్రీల ఎర్రటెండలో.. ఈ ప్రాక్టీస్ ఏంటి సామీ!!
IPL 2022: మాక్సీ, వినీ దావత్! RCB క్యాంపులో మళ్లీ పెళ్లి సందడి!
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్