అన్వేషించండి
Anant ambani wedding: నీతా అంబానీ మెహందీలో అంత స్పెషల్ ఉందా!
Nita Ambani: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో నీతా అంబానీ పెట్టుకున్న మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేతులపై వేసుకున్న చిత్రాలు ఆమెకు కుటుంబం మీద ఉన్న ప్రేమను చాటి చెబుతాయి .
(Photo Source: Twitter/ani)
1/5

ముంబై వేదికగా అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో నీతా అంబానీ పెట్టుకున్న మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె మెహందీలో తనకు కుటుంబం అంటే ఎంతో ఇష్టం అని తెలిపేలా కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు.
2/5

ఆమె తన చేతుల మీద పురాతన భారతీయ వివాహ సంప్రదాయం ప్రకారం ఆమె తన అరచేతులపై రాధా-కృష్ణల అందమైన రూపాలు వేయించుకున్నారు. ఇవి కొత్త జంట అనంత్-రాధికలను సూచిస్తుంది.
3/5

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ వేడుకల్లో నీతా అంబానీ కట్టుకున్న ప్రతి చీరా ప్రత్యేకమే. అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన మాతా కీ చౌకి (దుర్గామాత పూజ) నీతా అంబానీ హైలెట్‌గా నిలిచారు.
4/5

ఈ వేడుకలో నీతా అనురాధ వకీల్ డిజైన్ చేసిన ఎరుపు రంగు గుజరాతీ ఘర్చోలా చీరలో మెరిసిపోయారు. చీర మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. ఇక చీరకు తగ్గట్టే మ్యాచింగ్ నెక్‌సెట్, చెవిపోగులు, గాజులు ధరించారు.
5/5

వివాహం కోసం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌కు వరుడి తల్లి నీతా అంబానీ, అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన పీచు సిల్క్ ఘాగ్రాను ధరించారు.
Published at : 13 Jul 2024 11:55 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















