అన్వేషించండి
Kids Mobile Usage Daily Schedule : పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? పేరెంట్స్ దానిని లిమిట్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Limit Screen Time for Children : పిల్లలకు మొబైల్ వ్యసనమైతే అది వారి దినచర్య, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి పిల్లలను ఫోన్స్కి దూరంగా ఉంచేందుకు పేరెంట్స్ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
పిల్లలు మొబైల్ ఎక్కువగా చూస్తున్నారా? (Image Source : Freepik)
1/7

పిల్లలకు మొబైల్ ఉపయోగించే సమయాన్ని షెడ్యూల్ చేయండి. చదువుకున్న తర్వాత రోజుకు 1 గంట మాత్రమే ఉపయోగించాలనే నిబంధన పెట్టాలి. దీనివల్ల పిల్లలు ఒక పరిమితిలో మొబైల్ వాడే వీలు ఉంటుంది.
2/7

మొబైల్కు బదులుగా పిల్లలను క్రికెట్, ఫుట్బాల్ లేదా సైక్లింగ్ వంటి ఆటలు ఆడేలా ప్రోత్సాహించాలి. దీనివల్ల వారి దృష్టి ఫోన్ నుంచి డైవర్ట్ అవుతుంది. శారీరక దృఢత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
3/7

పిల్లవాడు హోంవర్క్ లేదా ఏదైనా పని బాగా చేస్తేనే అతనికి మొబైల్ ఉపయోగించడానికి వీలు ఉంటుందని కండీషన్ పెట్టండి. ఈ విధంగా మొబైల్ వారికి వ్యసనంగా మారకుండా ఉంటుంది.
4/7

పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం ఆడుకోండి. మాట్లాడండి. లేదా ఏదైనా యాక్టివిటీ చేయించండి. పిల్లలు వాటిలో నిమగ్నమైనప్పుడు మొబైల్ అవసరం తక్కువగా ఉంటుంది.
5/7

పిల్లలకు అర్థమయ్యేలా మొబైల్ ఎక్కువ వాడితే వచ్చే నష్టాలు చెప్పండి. ఫోన్ ఎక్కువ చూస్తే కళ్ళు బలహీనపడటం, నిద్ర సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలతో పాటు మెదడుపై ప్రభావం ఉంటుందని చెప్పండి. కారణాలను అర్థం చేసుకునేలా వివరిస్తే వినియోగం తగ్గుతుంది.
6/7

తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మొబైల్‌లో బిజీగా ఉంటే.. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.
7/7

నిద్రపోయే ముందు పిల్లల చేతుల్లో మొబైల్స్ పెట్టవద్దు. నిద్ర గదిలో టీవీ, మొబైల్స్ ఉంచకపోవడమే మంచిది. దీనివల్ల నిద్ర, దినచర్య రెండూ మంచిగా ఉంటాయి.
Published at : 11 Sep 2025 11:58 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















