అన్వేషించండి
Ayurveda Tips : ఈ 8 సమస్యలను దూరం చేసుకోవడానికి పసుపును ఇలా వాడేయండి.. ఆయుర్వేద టిప్స్
Turmeric Benefits : పసుపుతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందానికే కాదు గొంతు నొప్పి నుంచి ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.
పసుపుతో ఆరోగ్యానికి కలిగే లాభాలివే (Image Source : Freepik)
1/8

వర్షాకాలంలో గొంతు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీస్పూన్ పసుపును టేబుల్ స్పూన్ తేనెతో కలిపి పేస్ట్ చేయండి. గొంతులో చికాకును తగ్గించడానికి దీనిని తీసుకోవచ్చు. ఈ పేస్ట్ సహజంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయం చేస్తుంది.
2/8

ముక్కు దిబ్బడ, సైనస్ వంటి వాటినుంచి ఉపశమనం పొందడానికి ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. దానిలో అర టీస్పూన్ పసుపు వేయండి. తల మీద టవల్ కప్పుకుని దానిని బాగా పీల్చాలి. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ, సైనస్‌ను దూరం చేసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3/8

మెరిసే చర్మం కోసం పసుపుతో ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. పసుపు, శనగపిండి, పెరుగును కలిపి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మొటిమలను తగ్గించడంలో, చర్మపు రంగును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.
4/8

చిటికెడు పసుపు, ఉప్పును గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించాలి. ఇది నోటిలోని పుండ్లను నయం చేస్తుంది. చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. మీ నోరు తాజాగా ఉంటుంది.
5/8

ఒక టీస్పూన్ పసుపును నీటిలో మరిగించి పరగడుపున తాగాలి. ఈ డీటాక్స్ వాటర్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ పనితీరుకు హెల్ప్ చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
6/8

పసుపు, కలబంద గుజ్జును కలిపి పేస్ట్‌గా చేసి.. కాలిన గాయాలపై లేదా ఇతర గాయాలపై అప్లై చేయవచ్చు. ఇది క్రిమినాశకంగా హెల్ప్ చేస్తుంది. దురదను తగ్గిస్తుంది. గాయం త్వరగా నయం అవ్వడానికి సహాయం చేస్తుంది. వాపు, ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గిస్తుంది.
7/8

పసుపును పెరుగుతో కలిపి తలకు 20 నిమిషాల పాటు పట్టించాలి. ఈ సహజమైన, ఇంట్లో తయారుచేసిన మాస్క్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చుండ్రును తగ్గిస్తుంది. దురదను కూడా తగ్గిస్తుంది.
8/8

పసుపులో నూనె కలిపి వేడి చేసి.. నొప్పి ఉన్న కీళ్లపై రాయాలి. ఇది కణజాలాలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. వ్యాయామం వల్ల కలిగే నొప్పి, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
Published at : 08 Jul 2025 05:07 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















