Kalki 2898AD Sequel: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ - 'కల్కి 2898AD' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్...
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టైం వచ్చేసింది. ప్రభాస్ 'కల్కి 2898AD' సీక్వెల్ షూటింగ్‌పై మూవీ టీం క్రేజీ అప్డేట్ ఇచ్చింది.

Big Update On Prabhas Kalki 2898AD Sequel Shooting: పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఒకే రోజు వరుసగా సర్‌ప్రైజెస్ వస్తున్నాయి. ఇప్పటికే 'ఫౌజీ' మూవీ నుంచి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా... అవెయిటెడ్ విజువల్ వండర్ కల్కి 2898AD సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
సిల్వర్ స్క్రీన్‌పై 'కల్కి 2898AD'తో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లోనే సీక్వెల్ అనౌన్స్ ఇచ్చి భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అప్పటి నుంచీ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సీ యూ సూన్
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'కల్కి' నుంచి ప్రభాస్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'సినిమా యుగాన్ని పునర్నిర్వచించిన రెబల్ దళానికి... మన భైరవ & అందరి ప్రియమైన ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తదుపరి అధ్యాయం వెయిట్ చేస్తోంది. త్వరలో K సెట్స్‌లో కలుద్దాం.' అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని మూవీ టీం చెప్పకనే చెప్పారని తెలుస్తోంది.
To the REBEL force who redefined an era of cinema,
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 23, 2025
Happy Birthday to our Bhairava & everyone’s darling #Prabhas.
The next chapter awaits, see you soon on the sets of K. ⚡#HappyBirthdayPrabhas #Kalki2898AD pic.twitter.com/vtT9e1s8EZ
Also Read: ప్రభాస్ 'Z' సీక్రెట్ రివీల్ - డార్లింగ్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ వచ్చేసింది... బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది
ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్‌లో 'ది రాజా సాబ్' రూపొందుతుండగా వచ్చే ఏడాది జనవరి 9న మూవీ రిలీజ్ కానుంది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్‌లో 'ఫౌజీ' మూవీ షూటింగ్ సైతం శరవేగంగా సాగుతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ ట్రాక్ ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 'కల్కి 2898AD' సీక్వెల్ షూటింగ్ సైతం గ్రాడ్యూయెల్‌గానే స్టార్ట్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో దర్శక నిర్మాతలు మూవీ షూటింగ్‌పై మాట్లాడారు. అందరి డేట్స్ అన్నీ కుదరాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పగా... ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత చెప్పారు.
ఫస్ట్ పార్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటించగా రీసెంట్‌గా సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించారు. మూవీలో ప్రభాస్‌తో పాటు యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, శోభన కీలక పాత్రలు పోషించారు. సైన్స్ ఫిక్షన్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ మూవీని రూపొందించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ మూవీని నిర్మించారు.





















