Kohli retirement : విరాట్ కోహ్లీ ఆఖరి వన్డే ఆడేసినట్టేనా? సంచలనంగా మారుతున్న సైగలు!
Kohli retirement : అడిలైడ్‌లో జరిగిన భారత్ vs ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌లో పాల్గొన్న వారికి విరాట్ కోహ్లీ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. వస్తూనే అందరికీ బైబై చెప్తూ వెళ్లాడు.

Kohli Retirement : ప్రస్తుతం జరుగుతున్న భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ వరుసగా రెండోసారి డకౌట్ అయ్యాడు.
పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈరోజు కోహ్లీకి బాగా కలిసి వచ్చిన పిచ్‌పై 4 బంతుల్లో 0 పరుగులకే వెనక్కి వచ్చాడు.
ఆసీస్‌తో రెండో వన్డేలో కూడా డకౌట్ అయిన విరాట్ కోహ్లీ Virat Kohli duck outs#viratkohli #adelaideoval #indvsaus #ishantsharma #cricket #teamindia #shubhmangill pic.twitter.com/3trXRBvNT5
— ABP Desam (@ABPDesam) October 23, 2025
స్టార్ బ్యాట్స్‌మన్ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళుతుండగా, లైవ్ విజువల్స్ అతను ప్రేక్షకులకు గ్లౌవ్స్ చూపిస్తూ థాంక్స్ అన్నట్టు వెళ్తున్నట్టు కనిపించింది. ఒక విధంగా వీడ్కోలు పలికినట్లు చూపించాయి. ఈ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులలో రిటైర్మెంట్ ఊహాగానాలకు దారితీసింది.
కోహ్లీ ప్రేక్షకులకు వీడ్కోలు పలికినందుకు ఇంటర్నెట్ స్పందించింది
VIRAT KOHLI THANKING THE ADELAIDE CROWD. 🥺❤️ pic.twitter.com/cSFK2dN4tD
— Johns. (@CricCrazyJohns) October 23, 2025
ఈ సైగలను ప్రతిస్పందిస్తూ, Xలో ఒక అభిమాని ఇది ప్రేక్షకులకు కేవలం అంగీకారమా లేదా అతను రిటైర్ అయ్యే అవకాశం ఉందనే సంకేతమా అని ఆశ్చర్యపోయాడు.
The way Kohli thanked the fans actually scares me a bit pic.twitter.com/m6jUUEsytr
— Kevin (@imkevin149) October 23, 2025
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20లు, టెస్ట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు.
Kohli accepts the applause of Adelaide crowd as he walks off in his last innings at this iconic venue. pic.twitter.com/0nhnOJPnGz
— Silly Point (@FarziCricketer) October 23, 2025
మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సిరీస్‌లో భారత్ 264 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో భయంకరంగా కనిపించింది, ముఖ్యంగా ఈ పర్యటనకు చాలా విరామం తర్వాత రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. రాణించాల్సిన విరాట్ కోహ్లీ, గిల్ ఫెయిల్ అయినా రోహిత్ శర్మ-శ్రేయస్ అయ్యర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచిన తర్వాత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే స్కోరు బోర్డుపై పరుగులు లేవని కెప్టెన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ పరుగులు చేయకుండానే వెనుదగిరిగాడు. కానీ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. స్థిరమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. రోహిత్ 97 బంతుల్లో 73 పరుగులు, శ్రేయస్ 77 బంతుల్లో 61 పరుగులు చేశారు. అయితే వారు ఔటైన తర్వాత, వికెట్లు చాలా త్వరత్వరగా పడిపోయాయి. డెత్ ఓవర్లలో హర్షిత్ రాణా,అక్షర్ పటేల్ ధాటిగా ఆడి జట్టు స్కోరును 264 పరుగులకు చేర్చారు.



















