అన్వేషించండి
Satyabhama Serial Today November 20th Highlights :క్రిష్ తో చక్రిని నాన్నా అని పిలిపించిన సత్య ..మహదేవయ్యకి మామూలు షాక్ కాదిది - సత్యభామ నవంబరు 20 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: సత్య ని టార్గెట్ చేస్తూ మహదేవయ్య, సంజయ్, భైరవి కుట్రలు సాగుతూనే ఉన్నాయి. మరోవైపు క్రిష్ కి నిజం తెలియజేసే ప్రయత్నంలో ఉంది సత్య...

satyabhama serial november 20th episode Highlights
1/8

సంధ్యని రెస్టారెంట్‌లో కలసిన సంజయ్..విధి మనల్ని కలుపుతోందంటూ పడేసే కబుర్లు చెబుతాడు. ఇద్దరూ కలసి కాఫీ తాగుతారు
2/8

చక్రవర్తి కార్లో వెళుతూ సత్య ఎందుకలా నిలదీసింది..నన్ను మాత్రమేనా అన్నయ్యను కూడా అడిగిందా అనే ఆలోచనలో ఉంటాడు. ఇంతలో సత్య కాల్ చేసి మావయ్య మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని చెబుతుంది. వెంటనే నోరుజారిన చక్రవర్తి... క్రిష్ కి ఏమైందంటూ కంగారుపడుతూ హాస్పిటల్ కి వెళతాడు
3/8

మీ గుండె చప్పుడు ఇక్కడివరకూ వినిపిస్తోంది.. ఇప్పటికైనా నిజం చెప్పండి అంటే..బిడ్డల మార్పిడి, మహదేవయ్య బెదిరించిన విషయం మొత్తం చెప్పేసి బాధపడతాడు. కన్నవాళ్లు చేసిన తప్పులకు బిడ్డలు కూడా శిక్షలు అనుభవించాల్సిందే అంటాడు. మీ చేతకానితనానికి మంచితనం అనే ముసుగు వేస్తున్నారా అని సత్య నిలదీస్తుంది
4/8

సంతోషంగా ఉన్న హర్ష-నందిని కబుర్లు చెప్పుకుంటారు. సాయంత్రం తొందరగా వస్తాను నీకు ఇష్టమైన ఫుడ్ ఫెస్టివల్ కి తీసుకెళ్తానని మాటిస్తాడు హర్ష.. మురిసిపోతుంది నందిని. ఇదంతా చూసిన శాంతమ్మ అల్లరి పిల్ల అనుకుంటుంది...
5/8

శత్రువుని అయినా క్షమించవచ్చు కానీ నమ్మకద్రోహం చేసినవారిని క్షమించకూడదంటుంది సత్య. ధర్మం తప్పిన మనిషిని మనం వదిలినా దేవుడు వదిలిపెట్టడమ్మా అంటాడు చక్రవర్తి. నా కొడుకు క్షేమం కోసం సైలెంట్ గా ఉంటాను అన్న చక్రీతో..మీ కొడుకు ప్రాణాలతో మహదేవయ్య చెలగాటం ఆడుతున్నాడు అన్నీ తెలిసి కూడా మీరెందుకు సైలెంట్ గా ఉంటున్నారని అడుగుతుంది
6/8

మీకు మీరే కాదు మీ కన్న కొడుక్కి అన్యాయం చేస్తున్నారని ఫైర్ అవుతుంది సత్య. నువ్వు వేసే నిందల్ని తట్టుకోలేను...మౌనంగా ఉంటున్నాను, నిప్పులాంటి నిజాన్ని దాచుకుని గుంభనంగా ఉంటున్నా.. ఆబాధను దాచుకుని నిబ్బరంగా ఏమీ పట్టనట్టు నిలబడుతున్నాను.. నా కొడుకు క్షేమం కోసమే నోరుమూసుకుని ఉంటున్నానంటూ... తన భార్యను చంపిన విషయం కూడా చెబుతాడు
7/8

ఆవేశంగా ఇంటికెళ్లిన సత్య... మహదేవయ్యకి సేవలు చేస్తున్న క్రిష్ ని చూసి కోపంగా నిలబడిపోతుంది..
8/8

సత్యభామ నవంబరు 21 ఎపిసోడ్ లో... చక్రవర్తి బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంది సత్య. నీ కొడుకు సంజయ్ కూడా ఉంటే బావుండేది అంటుంది జయమ్మ. వీడు కొడుకు ఎలా అవుతాడని అంటే..నాన్నా అంటే అవుతాడు అంటుంది సత్య..మహదేవయ్య షాక్ అయి చూస్తాడు...
Published at : 20 Nov 2024 09:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion