అన్వేషించండి
Karthika Deepam 2 February 12th Highlights : కావేరి ఇంటికొచ్చిన కాంచన.. కార్తీక్‌కి జరిగిన విషయం చెప్పేసిన దీప.. శ్రీధర్‌కి ఇక చుక్కలే, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్‌కి కావేరి ఎలా సాయం చేసిందో చెప్తుంది దీప. కాంచన ఇది విని కావేరి దగ్గరకు వెళ్లడంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

శ్రీధర్‌తో మాటలు పడాల్సి వచ్చినందుకు కార్తీక్ చాలా ఫీల్ అవుతాడు. దీపపై కోపంతో.. నువ్వు ఎలాంటిదానివో ఈరోజు నాకు అందరూ చెప్తున్నారంటూ.. ఎవరితో మాటలు అనిపించుకోకూడదు అనుకున్నానో వారితోనే నన్ను అనిపించేలా చేశావు అంటూ సీరియస్ అవుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
2/9

దీంతో కార్తీక్‌కి ఆ రోజు ఏమి జరిగిందో చెప్తుంది దీప. ఆమెను మీరు మీ అమ్మకు ద్రోహం చేసిన వ్యక్తిగానే చూస్తున్నారు. కానీ నేను ఆవిడలో పశ్చాత్తాపాన్ని చూస్తున్నాను అంటూ చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
3/9

ఈ మాటలు విన్న కాంచన.. తాను చేసిన సాయానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. తన వల్లే శౌర్య ఈరోజు ఇంట్లో తిరుగుతుంది. నన్ను కావేరి ఇంటికి తీసుకెళ్లు అని అడుగుతుంది కాంచన.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
4/9

సుమిత్ర, దశరథ్‌లు ఎక్కడికి వెళ్లి ఉంటారా అని జ్యోత్స్న, గ్రానీ చర్చించుకుంటారు. దీంతో ఇంకెక్కడికి వెళ్తారు.. మమ్మీ, డాడీ ఆ దీప ఇంటికే వెళ్లి ఉంటారని అంటోంది జ్యోత్స్న. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
5/9

తండ్రి మాట దాటని దశరథ్ మారిపోయాడని.. కొన్ని రోజులకు తాతకూడా మారిపోతాడని పారిజాతం చెప్తుంది. దాంతో జ్యోత్స్న తాత పరువుకోసం ప్రాణం ఇస్తాడని మారడని చెప్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
6/9

ఈలోపు తాడోపేడో తేల్చుకోవాలని శ్రీధర్.. కావేరిని డబ్బు ఎందుకు ఇచ్చావంటూ నిలదీస్తాడు. నా డబ్బు నా ఇష్టమంటూ కావేరి శ్రీధర్‌కి బదులు ఇస్తుంది. అదే సమయంలో కాంచన అక్కడికి వస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
7/9

కావేరి అంటూ కాంచన పిలుస్తుంది. లోపలికి రావొచ్చా అని అడుగుతుంది. దీంతో శ్రీధర్ రావొద్దు అంటే.. ఆయన అలాగే అంటారు లోపలికి రా అక్కా అని పిలుస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
8/9

లోపలికి వచ్చిన కాంచన కావేరి చేయి పట్టుకుని థ్యాంక్స్ చెప్తుంది. దీంతో కావేరి ఏడుస్తూ.. అక్క నువ్వు నా పేరు పెట్టి పిలిచావు. నా చేయి పట్టుకున్నావు. ఇది చాలు అక్కా అంటూ ఎమోషనల్ అవుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
9/9

శ్రీధర్ కాంచనను పంపించేయాలని చూసినా.. కావేరి మాత్రం అతని మాట వినకుండా కాంచనతో మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తి అయింది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 12 Feb 2025 09:03 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
పాలిటిక్స్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion