అన్వేషించండి
Brahmamudi Serial November 7th Episode Highlights: నేను ఆకాశం నువ్వు మబ్బు అంటూ ఈగో బయటపెట్టిన రాజ్ - బ్రహ్మముడి నవంబరు 07 ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..
Brahmamudi Serial Today November 06th Highlights
1/10

కంపెనీ ఎంప్లాయ్స్‌కు బోనస్‌లు రాజ్ చేతులమీదుగా ఇప్పిస్తే బావుంటుంది అంటుంది కావ్య. CEO అయినందుకే ఈ ఇంట్లో చాలా మందికి నాపై కోపంగా ఉంది..ఇక బోనస్ చెక్ లు అందిస్తే చూస్తూ ఊరుకుంటారా అంటుంది. రాజ్ ఏం కోల్పోయాడో తెలియజేసేందుకే ఇదంతా అంటుంది ఇందిరాదేవి
2/10

ఇందిరాదేవి తన మాట వినకపోవడంతో రాజ్‌తోనే మాట్లాడాలి అనుకుంటూ తన రూమ్ కి వెళుతుంది. లోపలకు ఎందుకొచ్చావ్? ఏదైనా ఉండే రూమ్ బయటే మాట్లాడు అంటాడు. నేను మిమ్మల్ని బతిమలాడేందుకు రాలేదని క్లారిటీ ఇస్తుంది కావ్య. మా అమ్మ విషయంలో తప్పు చేశావ్, మీ అమ్మతో నాటకం ఆడించావ్ అంటూ మళ్లీ మొదలెడతాడు రాజ్..
3/10

మీరు జీవితాంతం నన్ను అర్థం చేసుకోలేరన్న కావ్య..తాను వచ్చిన విషయం చెబుతుంది. నీకు ఇచ్చిన చెక్కులు నాకు దానం ఎందుకు.. ఈ కంపెనీకి ఎప్పటికైనా నేనే సీఈఓ..నేను ఆకాశం లాంటోడిని నువ్వు మబ్బుల్లా వచ్చిపోవడమే అని సెటైర్ వేస్తాడు.
4/10

అప్పు-కళ్యాణ్ రావడం చూసి రుద్రాణి ఓర్వలేకపోతుంది..బయటకు మాత్రం ధాన్యలక్ష్మి వాళ్లని క్షమించేయవచ్చు కదా అంటూ మాట్లాడుతుంది. మీనోట మంచిమాటలు ఎలా సాధ్యం అంటూ స్వప్న ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే వచ్చిన ప్రకాశం ఇంత ఆలస్యంగా వచ్చారేంటి అంటాడు
5/10

కొడుకు ఇంటికి వచ్చినా ఎందుకా చికాకు మొహం అని ప్రకాశం అడుగుతాడు.. ఎప్పటికీ ఉండడుగా అని ధాన్యలక్ష్మి అంటే..మరి అప్పుని కోడలిగా ఒప్పుకుంటావా అంటాడు. అదెప్పకిటీ జరగదని ధాన్యలక్ష్మి..అయితే కళ్యాణ్ ఇక్కడ ఉండడం కూడా జరగదని ప్రకాశం అంటారు..
6/10

తల్లిదండ్రులకోసం కొన్న కొత్తబట్టలు తీసుకొచ్చి ఇస్తాడు కళ్యాణ్. అప్పుని రమ్మంటే రాను అంటుంది...దూరంగా ఉంటే ఇంకా దూరం అవుతావ్ పద అని తీసుకెళ్తాడు. ఇంత అదృష్టం ఎవరకీ దక్కదు అని అపర్ణ అంటుంది.
7/10

ధాన్యలక్ష్మి మాత్రం కొడుక్కి మాత్రమే బట్టలు కొంటుంది..నీ సంగతి తెలిసి నేను కొన్నానులే అని కోడలికోసం ప్రకాశం చీర తీసుకొస్తాడు. ఇదంతా చూసి రుద్రాణి సహించలేకపోతుంది
8/10

అక్కచెల్లెళ్లు ముగ్గురు కలసి పూజ చేస్తారు. ఇది చూసి రుద్రాణి-రాహుల్ రగిలిపోతుంటారు. కావ్య ఇచ్చే హారతిని తీసుకునేందుకు రాజ్ అంగీకరించడు కానీ ఇందిరాదేవి గట్టిగా చెప్పడంతో తీసుకుంటాడు
9/10

బ్రహ్మముడి నవంబరు08 ఎపిసోడ్ లో కావ్య చేతులమీదుగా ఉద్యోగులకు బోనస్ చెక్కులు అందిస్తుంది. అయితే CEO కూడా కంపెనీలో ఉద్యోగితో సమానమే కదా అంటూ దుగ్గిరాలవారి వారసుడిగా తన చేతుల మీదుగా కావ్యకు చెక్ అందిస్తాడు రాజ్..
10/10

ఇంత ఆనందం చూడలేకపోతున్నాను తొందరగా వీడియో టెలికాస్ట్ చేయి అంటూ అనామికకు కాల్ చేస్తుంది రుద్రాణి.. కొద్దిసేపు ఓపికపట్టండి ఆంటీ అంటుంది అనామిక...బ్రహ్మముడి నవంబరు 08 ఎపిసోడ్ లో కళ్యాణ్ వీడియో హైలెట్ కానుంది..
Published at : 07 Nov 2024 08:58 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















