అన్వేషించండి
Brahmamudi October 26th Episode: ఆఫీసులో కావ్య రాజ్ టామ్ అండ్ జెర్రీ వార్ మొదలు - బ్రహ్మముడి అక్టోబరు 26 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today October 26th Highlights
1/7

ఆఫీసుకి వెళ్లమని అందరూ తనను బతిమలాడుతారు అనుకుంటాడు రాజ్..కానీ ఎవ్వరూ తనని పట్టించుకోరు. తండ్రి దగ్గరకు వెళ్లి నన్ను ఏదో అడగాలి అనుకుంటున్నారు కదూ అంటాడు..అవునురా నా కారు సర్వీసింగ్ కి ఇచ్చాను నీ కారు తీసుకెళ్తాను అంటాడు. ఒప్పుకుంటాడులే అన్నయ్యా వాడికి పనా పాటా అని పంచ్ వేస్తాడు ప్రకాశం..
2/7

ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో అని ఇందిరాదేవి అంటుంది..అప్పుడే వచ్చిన అపర్ణ కూరగాయలు తీసుకురా అంటుంది. షాక్ అయిన రాజ్ తో.. కావ్యకు జడుసుకుని ఆఫీసుకి ఎలాగూ వెళ్లడం లేదు..అందుకే ఇంటిపనులు అయినా చేయి అంటుంది. మీరు రూట్ మార్చారా.. నేనుకూడా రూటు మారుస్తా అనుకుని కూరగాయలకు వెళతా లిస్ట్ ఇవ్వండి అంటాడు.. అక్కడ కనకం సిద్ధంగా ఉంటుంది..
3/7

ఆఫీసుకి వెళ్లిన కావ్యకు సెక్యూరిటీ సరిగ్గా సెల్యూట్ చేయకపోవడంతో..ఈ పని అయినా సరిగా చేయి అంటుంది కావ్య. సరిగ్గా చేయకపోతే బాత్ రూమ్ క్లీనింగ్ కి పంపిస్తా అంటుంది. ఈమె నాపై పగ పెంచుకుంది అనుకుంటాడు. మరోవైపు రాజ్-కావ్యలో ఎవరు వస్తారో స్టాఫ్ లో పందెం కడుతుంది శ్రుతి..అప్పుడే కావ్య ఎంట్రీ ఇస్తుంది.
4/7

కంపెనీ నుంచి వెళ్లిపోయినవాళ్లతో మాట్లాడాలి మీటింగ్ అరెంజ్ చేయి అని శ్రుతికి చెప్పి.. అపర్ణకి కాల్ చేస్తుంది. మీరు తప్పుచేస్తున్నారేమో అత్తయ్యా ఆయన బాధపడుతున్నారు అంటుంది. అదంతా కాకుండా ఆఫీసు గురించి ఆలోచించు అని చెబుతుంది. అంత అవమానించినా వాడి గురించే ఆలోచిస్తోంది ఎంత పిచ్చిదో చూశారా అత్తయ్యా అంటుంది అపర్ణ. వాడిని టార్చర్ చేయాలని ఫిక్సవుతారు...
5/7

మార్కెట్లో కనకం రెడీగా ఉంటుంది. కూరగాయలు భారీ రేట్లు పెట్టి కొనేస్తుంటాడు..600 కూరగాయలకు 6 వేలు అయిందంటాడు. ఎంట్రీ ఇచ్చిన కనకం షాపువాడితో గొడవ పెట్టుకుంటుంది. వాడు మోసం చేశాడు సరే మీరేం చేశారు క్యాన్సర్ కనకం గారు అనేలి పంతం కొద్ది 6 వేలు ఇచ్చి వెళ్లిపోతాడు
6/7

పాత క్లైంట్స్ మనతో పనిచేయను అంటున్నారని శ్రుతి చెప్పడంతో.. కావ్య షాక్ అవుతుంది. ఈ లోగా అనామిక కాల్ చేసి నీ క్లైంట్స్ ని లాక్కున్నాను నీ సంస్థను నేలమట్టం చేస్తానంటుంది.
7/7

రాజ్ ని మళ్లీ ఆడుకోవడం మొదలెడతారు.. కావ్యకు భయపడుతున్నావా అని ఇందిరాదేవి, రాహుల్ లా ఇంట్లోనే ఉండిపోతావా అని స్వప్న అంటారు. నేను ఆఫీసుకి వెళ్లాలి అంతే కదా అని బయలుదేరుతాడు.. హమ్మయ్య అనుకుంటారంతా...
Published at : 26 Oct 2024 10:27 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion