అన్వేషించండి
Balu Gani Talkies On AHA: ఆహాలో టాప్ 10లో టెండింగ్ లిస్టులో 'బాలు గాని టాకీస్' - అసలు ఏముందీ సినిమాలో
Balu Gani Talkies OTT Streaming Platform: ఆహా ఓటీటీలో 'బాలు గాని టాకీస్' ఫిల్మ్ దూసుకు వెళుతోంది. టాప్ 10 ట్రెండింగ్ లిస్టులో ఉందీ సినిమా. అసలు ఇందులో ఏముంది? కథ ఏంటి? అంటే...

ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ లిస్టులో 'బాలు గాని టాకీస్'
1/5

శివ రామచంద్ర వరపు కథానాయకుడిగా నటించిన సినిమా 'బాలు గాని టాకీస్'. ఈ సినిమాలో ఆయన బాబాయ్ పాత్రలో రఘు కుంచె, కథానాయికగా శరణ్య శర్మ, ఇతర కీలక పాత్రల్లో సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి నటించారు. ఆహా ఓటీటీలో ఈ నెల (అక్టోబర్ 4న) ఎక్స్‌క్లూజివ్‌గా సినిమా విడుదలైంది.
2/5

'బాలు గాని టాకీస్' సినిమాకు విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఆయన యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, కొన్ని యాడ్ ఫిలిమ్స్ చేశారు. డిజిటల్ స్క్రీన్ మీద తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు ఓటీటీ స్క్రీన్ మీదకు వచ్చారు. దర్శకుడిగా మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు.
3/5

'బాలు గాని టాకీస్' సినిమా విషయానికి వస్తే... ఇదొక సినిమా హల్ చుట్టూ తిరుగుతుంది. పల్లెటూరులోని ఆ హాలులో ఎప్పుడూ షకీలా సినిమాలు వేస్తుంటారు. కొత్త సినిమాలు వేయాలని హీరో ప్రయత్నిస్తుంటాడు. అయితే... ఆ హాలులో ఓ హత్య జరుగుతుంది. ఆ కేసులో హీరో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? మర్డర్ చేసింది ఎవరు? హీరోని ఇరికించింది ఎవరు? అనేది కథ. దర్శకుడు విశ్వనాథ్ ప్రతాప్ దీనిని తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఆయన రైటింగ్, మేకింగ్ బావుందని జనాలు చెబుతున్నారు.
4/5

'బాలు గాని టాకీస్' చిత్రాన్ని శ్రీనిధి సాగర్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు రూపక్ ప్రణవ్ తేజ్, గుడిమిట్ల శివ ప్రసాద్ సహ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తే జనాలు ఆదరిస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
5/5

సహజత్వానికి దగ్గరగా విశ్వనాథ్ ప్రతాప్ సినిమాను తెరకెక్కించిన 'బాలు గాని టాకీస్' విజయానికి ప్రధాన కారణం అని చెప్పాలి. పల్లెటూరిలో ప్రతీకారాలు, అక్కడ భావోద్వేగాలను సినిమాలో చూపించిన విధానానికి ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
Published at : 14 Oct 2024 09:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion