అన్వేషించండి
Abhinav Gomatam: అమెజాన్ ప్రైమ్ వీడియోలో అభినవ్ గోమఠం 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'కు రికార్డ్ వ్యూస్
Masthu Shades Unnai Ra OTT Response: యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా నటించిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి స్పందన లభిస్తోంది.

'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమాలో ప్రధాన తారాగణం
1/5

Prime Video Latest Telugu Movies: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన లేటెస్ట్ తెలుగు సినిమాల్లో 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా నటించిన చిత్రమిది. దీనిని ఓటీటీ వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
2/5

'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. అటు ఆడియన్స్, ఇటు క్రిటిక్స్ నుంచి మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రైమ్ వీడియో ఓటీటీలో మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు 100 ప్లస్ మిలియన్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ / వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయని, ఇప్పటికీ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు దర్శక నిర్మాతలు.
3/5

'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమాలో అభినవ్ గోమఠం సరసన వైశాలి రాజ్ కథానాయికగా నటించారు. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకం మీద ఆరెం రెడ్డి, ప్రశాంత్ .వి, భవాని కాసుల సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. అలీ రెజా, మొయిన్ ప్రధాన పాత్రలు పోషించారు.
4/5

ఈ నవీన యుగంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా... భావోద్వేగాలను మించిన టెక్నాలజీ అందుబాటులోకి రాలేదనే కథాంశంతో బలమైన భావోద్వేగాలను బేస్ చేసుకుని తీసిన సినిమా 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'. ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునే విధంగా ఇంటిల్లిపాది చూసేలా సినిమాను తెరకెక్కించారు.
5/5

Masthu Shades Unnai Ra Movie Cast And Crew: అభినవ్ గోమఠం, వైశాలి రాజ్ జంటగా నటించిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమాలో అలీ రెజా, మోయిన్, 'నిజాల్' రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, 'రాకెట్ రాఘవ' తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ: అన్వర్ సాదిక్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ స్వయంభూ, సంగీతం: సంజీవ్ .టి, కూర్పు: రవితేజ గిరిజాల.
Published at : 03 Aug 2024 06:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion