అన్వేషించండి
Karthikeya 2: ‘కార్తికేయ 2’లో కథను నడిపించే కీలక పాత్రలు ఇవేనట!

Karthikeya 2
1/8

హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ‘కార్తికేయ 2’. వీరి కాంబినేషన్‌లో ఇదివరకు విడుదలైన ‘కార్తికేయ’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ‘కార్తికేయ-2’లో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘సముద్రం దాచుకున్న అతి పెద్ద సహస్యం ఈ ద్వారకా నగరం’ అంటూ నిఖిల్ చెప్పిన డైలాగ్‌తో.. ఆకాశంలో మెరుపులు - ఉరుములు... పక్షులు... మధ్యలో వెళ్తున్న పడవలో నిఖిల్, అనుపమ, శ్రీనివాసరెడ్డి నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ ఉంటుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో వివిధ పాత్రలను ప్రేక్షకులను పరిచయం చేస్తూ మరికొన్ని పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఎవరెవరు ఏయే పాత్రల్లో కనిపించనున్నారో ఇక్కడ చూసేయండి.
2/8

ధన్వంత్రిగా అనుపమ్ ఖేర్
3/8

ముగ్దాగా అనుపమా పరమేశ్వరన్
4/8

సదానందగా శ్రీనివాస రెడ్డి
5/8

కార్తికేయగా నిఖిల్
6/8

శాంతానుగా ఆదిత్య మీనన్
7/8

సులేమాన్‌గా హర్ష
8/8

ఇవే.. ‘కార్తికేయ 2’ టీమ్ రిలీజ్ చేసిన ఆ ఆరు కీలక పాత్రలు
Published at : 10 Jun 2022 11:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion